Balakrishna Comment : బాలయ్య రెడీ టీడీపీ ఓకేనా
బాంబు పేల్చిన నటసింహం
Balakrishna Comment : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఉన్నట్టుండి వేడిని రాజేస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ(TDP) హాట్ టాపిక్ గా మారింది. ఓ వైపు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ నేను ఉన్నానంటూ ప్రకటిస్తుంటే , తనకు అన్న లాంటి వాడి సపోర్ట్ ఉందని అల్లుడు నారా లోకేష్ చెప్పడం ఒకింత విస్తు పోయేలా చేసింది. తెలుగుదేశం పార్టీ అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది దివంగత సీఎం నందమూరి తారక రామారావు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కీలకంగా మారారు. తానే పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చారు. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన బాబు తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు.
Balakrishna Comment Viral
కానీ ఉమ్మడి ఏపీలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న బాబుకు మొదటిసారి షాక్ తగిలింది తెలంగాణలోనే. అందుకు కారణం ప్రస్తుత సీఎంగా ఉన్న కేసీఆర్. నోటుకు ఓటు కేసులో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అడ్డంగా బుక్కయ్యాడు. ఆపై జైలుకు వెళ్లాడు. ఇందులో ఎమ్మెల్సీ కొనుగోలు విషయం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇదే సమయంలో చంద్రబాబు బ్రీఫ్డ్ మీ అన్న వర్డ్స్ అప్పట్లో కలకలం రేపాయి. తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో ఏపీ విడి పోయింది. తెలంగాణకు సీఎంగా కేసీఆర్ , ఏపీకి చంద్రబాబు ఉన్నారు. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు ఆనాటి గవర్నర్ నరసింహన్. ఆ తర్వాత ఊహించని రీతిలో 23 సీట్లకే పరిమితం అయ్యింది టీడీపీ. ఏపీలో జగన్ రెడ్డి ప్రభంజనంలా దూసుకు వచ్చాడు.
ఆనాటి నుంచి నేటి దాకా చంద్రబాబు వర్సెస్ జగన్ రెడ్డిగా మారి పోయింది. మధ్యలో పవన్ ఉన్నా మాటల యుద్దానికి మాత్రం తెర లేపారు .ఇదే సమయంలో ఎన్నడూ కన్నీరు పెట్టని చంద్రబాబు నాయుడు తన భార్య భువనేశ్వరి గురించి కించ పరిచేలా మాట్లాడారంటూ వాపోయాడు. దేశ వ్యాప్తంగా అది కలకలం రేపింది. చంద్రబాబు ఏమిటి..ఏడ్వడం ఏమిటి అని. ఇదే సమయంలో తన హయాంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్ మెంట్ స్కీం స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. కోర్టులో హాజరు పర్చడంతో 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఇదంతా కక్ష సాధింపు ధోరణితో చేసిందే తప్పా తన తండ్రి అలాంటి వాడు కాదని లోకేష్, తన భర్త ముత్యం లాంటి వాడని భువనేశ్వరి, పాపం పండింది ప్రజలు మరోసారి ఆలోచించు కోవాలని కుటుంబీలు బహిరంగంగా విమర్శించారు.
ఇదంతా పక్కన పెడితే బావమరిది అయిన ప్రముఖ నటుడు , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna)సంచలన కామెంట్స్ చేశారు. అల్లుడు యువ గళం పాదయాత్రతో ముందుకు సాగుతుంటే , తాను మాత్రం ఇక ఉపేక్షించ బోనని, ముందుండి తెలుగుదేశం పార్టీని నడిపిస్తానంటూ ప్రకటించాడు మీడియా సాక్షిగా. ప్రస్తుతం ఆయన చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. పార్టీ వర్గాలను ఉలిక్కి పడేలా చేసింది. ఉత్సాహాన్ని నింపింది. రాబోయే రోజుల్లో బాలయ్య రెండు పడవల మీద స్వారీ ఎలా చేస్తారనేది చూడాలి. ఓ వైపు సినిమా ఇంకో వైపు పాలిటిక్స్ . మొత్తంగా నటసింహం రాకతో ఏపీ రాజకీయ ముఖ చిత్రం మారుతుందా వేచి చూడాలి.
Also Read : AP ACB Court : బాబుకు ఏసీబీ కోర్టు బిగ్ షాక్