Rahul Gandhi : ప్రజా సంక్షేమం కాంగ్రెస్ లక్ష్యం
వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ
Rahul Gandhi : న్యూఢిల్లీ – సామాజిక న్యాయం కోసం, ప్రజలందరి బాగు కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని స్పష్టం చేశారు ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ. అన్ని వర్గాలకు లబ్ది చేకూర్చేలా పాటు పడుతుందన్నారు. విద్య, వైద్యం, ఉపాధి అన్నవి తమ ముందున్న లక్ష్యాలని స్పష్టం చేశారు.
Rahul Gandhi Comment
రాహుల్ గాంధీని నార్వే మాజీ ప్రధాన మంత్రి ఎర్నా సోల్బర్గ్ , ఇతర చట్ట సభ్యులు ఢిల్లీకి విచ్చేశారు. ఈ సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిశారు. వారితో కాంగ్రెస్ పార్టీ సిద్దాంతం, ప్రజల కోసం చేస్తున్న కృషిని వివరించారు.
సంక్షేమం, సామాజిక న్యాయం ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi ). ప్రపంచ వ్యాప్తంగా ఇదే కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. భారత దేశం ముందు నుంచి శాంతిని కోరుకుంటుందని పేర్కొన్నారు.
ఇవాళ యావత్ ప్రపంచం టెక్నాలజీ కారణంగా మరింత దగ్గరైందని, కానీ ఉగ్రవాదపు ముప్పు నుంచి బయట పడలేక పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు గాను అన్ని దేశాలు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు రాహుల్ గాంధీ.
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాల కూటమి ఇండియా తప్పక విజయం సాధిస్తుందని జోష్యం చెప్పారు కాంగ్రెస్ ఎంపీ.
Also Read : Ajmeera Prahallad Joins : బీజేపీ గూటికి అజ్మీరా ప్రహ్లాద్