Ajmeera Prahallad Joins : బీజేపీ గూటికి అజ్మీరా ప్ర‌హ్లాద్

కండువా క‌ప్పిన ఈట‌ల రాజేంద‌ర్

Ajmeera Prahallad Joins : హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక‌ల వేడి మొద‌లైంది. ఇప్ప‌టికే బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్ 115 మంది అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌కు నేత‌లు క్యూ క‌డుతున్నారు. ఆయా పార్టీల కండువాలు క‌ప్పుకుంటున్నారు.

Ajmeera Prahallad Joins in BJP

తాజాగా భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ త‌న‌యుడు అజ్మీరా ప్ర‌హ్లాద్ బీజేపీలో చేరారు. హైద‌రాబాద్ లోని బీజేపీ కార్యాల‌యంలో జ‌రిగిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స‌మ‌క్షంలో కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ప్ర‌హ్లాద్ తో పాటు ప‌లువురు బీజేపీ కండువా క‌ప్పుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఈట‌ల రాజేంద‌ర్(Eatala Rajender) ప్ర‌సంగించారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు బీజేపీ ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని చెప్పారు. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన ప్ర‌తి ఒక్క‌రికీ స‌ముచిత స్థానం క‌ల్పిస్తుంద‌ని అన్నారు.

కేంద్రంలో 75 మంది మంత్రులు ఉంటే ఇందులో 27 మంది బీసీకి చెందిన వారు కేంద్ర మంత్రులుగా కొలువు తీరార‌ని స్పష్టం చేశారు ఈట‌ల రాజేంద‌ర్. అంతే కాదు 12 మంది ఎస్సీలు, 8 మంది గిరిజ‌న సామాజిక వ‌ర్గానికి చెందిన వారు మంత్రులుగా మోదీ ఛాన్స్ ఇచ్చార‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : TTD Chairman : శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు రండి

Leave A Reply

Your Email Id will not be published!