TTD Chairman : శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు రండి

సీఎంకు టీటీటీ ఆహ్వానం

TTD Chairman : తాడేప‌ల్లిగూడెం – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో సెప్టెంబ‌ర్ 18 నుండి 26 వ‌ర‌కు శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఏటా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి తిరుమ‌లలో కొలువు తీరిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌కు ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

TTD Chairman Invites AP CM YS Jagan

ఇందులో భాగంగా శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి(Bhumana Karunakar Reddy), కార్య‌నిర్వ‌హ‌ణ అధికారి ఏవీ ధ‌ర్మారెడ్డి, తిరుమ‌ల ఆల‌య పూజారులు, అర్చ‌కులు లండ‌న్ ప‌ర్య‌ట‌న ముగించుకుని వ‌చ్చిన సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లుసుకున్నారు.

టీటీడీ చైర్మ‌న్, ఏవో సీఎంకు శ్రీ‌వారి ఆల‌యం త‌ర‌పున సాల‌క‌ట్ల ఉత్స‌వాల‌కు ముఖ్య అతిథిగా హాజ‌రు కావాల‌ని కోరారు. ఈ మేర‌కు ప్ర‌త్యేక ఆహ్వాన ప‌త్రిక‌ను జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అంద‌జేశారు.

అంత‌కు ముందు భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, ఏవో ధ‌ర్మా రెడ్డిలు సీఎంకు తిరుమ‌ల నుంచి తీసుకు వ‌చ్చిన ప్ర‌త్యేక శాలువాను జ‌గ‌న్ రెడ్డికి క‌ప్పారు. అర్చ‌కులు, వేద పండితులు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఆశీర్వ‌దించారు.

Also Read : Eatala Rajender : కాషాయం విజ‌యం ఖాయం

Leave A Reply

Your Email Id will not be published!