Natti Kumar : బాబు అరెస్ట్ పై నోరు విప్పండి
నిర్మాత నట్టి కుమార్ కామెంట్
Natti Kumar : హైదరాబాద్ – తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ సినీ నిర్మాత నట్టి కుమార్(Natti Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ రంగానికి ఎన్టీఆర్ తర్వాత టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎక్కువగా కృషి చేశారని కొనియాడారు. ఆయన వల్లనే ఇవాళ ఈ రంగం ఇలా కళ కళ లాడుతోందని అన్నారు నట్టి కుమార్.
Natti Kumar Comments Viral
ఆయన మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. సినీ రంగాన్ని ఏలుతున్న అగ్ర నటులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడును అన్యాయంగా అరెస్ట్ చేస్తే ఎందుకు నోరు విప్పడం లేదంటూ నిలదీశారు.
బాబు అరెస్ట్ ను అగ్ర నటులు జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, ప్రభాస్ , రాజమౌళి స్పందించాలని డిమండ్ చేశారు. ఇంత వరకు ఒక్కరు కూడా స్పందించక పోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ కోసం చంద్రబాబు నాయుడు ఎంతగానో పాటు పడ్డారని గుర్తు చేశారు నట్టి కుమార్.
ఒకవేళ బాబుకు మద్దతు తెలియ చేస్తే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మిమ్మల్ని ఏమైనా ఉరి తీస్తాడా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిల్మ్ చాంబర్ లోని నందమూరి ఫ్యాన్స్ ఎందుకు స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నట్టి కుమార్.
కనీసం పరామర్శించక పోయినా తాము ఉన్నామంటూ సోషల్ మీడియాలో మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం నట్టి కుమార్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : Minister KTR : మేమే గెలుస్తం మాదే రాజ్యం