K Raghavendra Rao : శ్రీవారి ఆశీస్సులతో బాబు వస్తాడు
దర్శకుడు కె. రాఘవేంద్ర రావు
K Raghavendra Rao : హైదరాబాద్ – ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు సంచలన కామెంట్స్ చేశారు. ఆయన టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ట్విట్టర్ వేదికగా కె. రాఘవేంద్రరావు స్పందించారు.
K Raghavendra Rao Comment
శ్రీ వేంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలతో అలిపిరి వద్ద జరిగిన కారు బాంబు బ్లాస్ట్ లో ఆనాడు నారా చంద్రబాబు నాయుడు బతికి బయట పడ్డాడని , ఇప్పుడు కూడా జైలు పాలైన మాజీ సీఎం తిరిగి బయటకు వస్తాడని ఆశా భావం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కీం స్కామ్ కేసులో నారా చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకుంది. ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.
ఈ మేరకు జైలర్ అధికారులు నారా చంద్రబాబు నాయుడుకు ఖైదీ నెంబర్ కూడా కేటాయించారు. తనకు 73 ఏళ్లు ఉన్నాయని, గృహ నిర్బంధంలో ఉండేలా అవకాశం ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరపు లాయర్లు సిద్దార్థ్ లూథ్రా(Siddharth Lutra), వెంకటేశ్వర్ రావు పిటిషన్లు దాఖలు చేశారు.
దీనిపై ఏసీబీ కోర్టు జడ్జి హిమ బిందు సీరియస్ అయ్యారు. చట్టం అందరికీ ఒక్కటేనని స్పష్టం చేశారు. మాజీ సీఎం అయినంత మాత్రాన చట్టం ప్రత్యేకంగా ఉండదని ఇచ్చిన తీర్పులో పేర్కొన్నారు.
Also Read : Kerala High Court : పోర్న్ చూస్తే నేరం కాదు