Babar Azam : బాబర్ ఆజమ్ కంటతడి
శ్రీలంక చేతిలో పాక్ ఓటమి
Babar Azam : కొలంబో – ఆసియా కప్ 2023 టోర్నీలో ఊహించని రీతిలో పాకిస్తాన్ ఓటమి పాలైంది. శ్రీలంక జట్టు చేతిలో అనూహ్యంగా ఓడి పోయింది. పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లాడు శ్రీలంక క్రికెటర్ అసలంక. అసమాన పోరాట పటిమను ప్రదర్శించాడు. కోలుకోలేని దెబ్బ కొట్టాడు.
Babar Azam Emotional
ఎలాగైనా సరే తన సారథ్యంలో పాకిస్తాన్ జట్టుకు చిరస్మరణీయమైన ఆసియా కప్ ను అందించాలని కలలు కన్నాడు. కానీ కలలు కల్లలు అయ్యాయి. చివరి ఓవర్ లో 8 పరుగులు చేయాల్సి వచ్చింది శ్రీలంక జట్టుకు. 5వ బంతికి ఫోర్ 6వ బంతికి 2 పరుగులు చేసి గ్రాండ్ విక్టరీని అందించాడు అసలంక.
దీంతో పాకిస్తాన్ ఆసియా కప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఊహించని రీతిలో ఉత్కంఠ భరిత విజయాన్ని నమోదు చేసి ఏకంగా ఫైనల్ కు చేరిన శ్రీలంక ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
ఇదిలా ఉండగా ఆఖరి ఓవర్ లో అనూహ్యంగా ఓటమి పాలైన పాకిస్తాన్ తేరుకోలేదు. జట్టు స్కిప్పర్ బాబర్ ఆజమ్(Babar Azam) కంటతడి పెట్టాడు. బోరున విలపించాడు. ఈ పరాజయాన్ని తట్టుకోలేక పోయాడు. ప్రస్తుతం నెట్టింట్లో బాబర్ వైరల్ గా మారాడు. అయ్యో అని ఫ్యాన్స్ వాపోతున్నారు. నువ్వు రియల్ క్రికెటర్ వంటూ కొందరు ప్రశంసిస్తున్నారు.
Also Read : CV Anand : పరారీలో ఉన్న వారిని పట్టుకుంటాం