Dasun Shanaka : అసలంక గెలిపిస్తాడని తెలుసు
శ్రీలంక జట్టు కెప్టెన్ షనక
Dasun Shanaka : కొలంబో – ఆసియా కప్ 2023 టోర్నీలో అనూహ్యమైన విజయాన్ని సాధించంది శ్రీలంక జట్టు. దాయాది పాకిస్తాన్ ను మట్టి కరిపించింది. ఆ జట్టు ఫైనల్ కు వెళ్లాలన్న ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో పాకిస్తాన్ తీవ్ర నిరాశకు లోనైంది. ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ కంటతడి పెట్టాడు. ప్రస్తుతం వైరల్ గా మారాడు.
Dasun Shanaka Comment
ఇది పక్కన పెడితే చివరి ఓవర్ దాకా ఉత్కంఠ భరితంగా సాగింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ శ్రీలంక ముందు 253 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. దీనిని సాధించేందుకు మైదానంలోకి దిగింది శ్రీలంక.
జట్టులో గెలుపు బాట వేశారు కుశాల్ మెండీస్ 91 రన్స్ చేస్తే, సదీర సమర విక్రమ్ 48 రన్స్ చేశారు. ఆ తర్వాత వికెట్లు పడినా ఆఖరున చరిత్ అసలంక మ్యాజిక్ చేశాడు. చివరి ఓవర్ వరకు మ్యాచ్ కొనసాగింది. ఆఖరి ఓవర్ లో 8 రన్స్ కావాలి. చివరి బంతికి 2 రన్స్ పూర్తి చేసి శ్రీలంకకు విజయం చేకూర్చి పెట్టాడు అసలంక.
5వ స్థానంలో వచ్చిన అసలంక 49 రన్స్ చేశాడు. చివరి దాకా నాటౌట్ గా నిలిచి పాకిస్తాన్ కు చుక్కలు చూపించాడు. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం శ్రీలంక స్కిప్పర్ షనక(Dasun Shanaka) మీడియాతో మాట్లాడాడు. అసలంక ఏదో ఒక సమయంలో తమ జట్టును గెలిపిస్తాడని , ఆ నమ్మకం తనకు ఉందన్నాడు .
Also Read : Babar Azam : బాబర్ ఆజమ్ కంటతడి