Siddarth Luthra : Comment లూథ్రా ఆయుధం పట్టమంటే ఎలా
Siddarth Luthra : గీత దాటిన సుప్రీం లాయర్
Siddarth Luthra : ఎవరీ సిద్దార్థ్ లూథ్రా అనుకుంటున్నారా. జగమెరిగిన న్యాయవాది. భారత దేశంలో అత్యంత ఖరీదైన లాయర్లలో ఈయన కూడా ఒకరు. ఎంతటి క్లిష్టమైన కేసులైనా సరే వాదించి , మెప్పించి గెలిచేలా చేయడంలో తనకు తనే సాటి. భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం లో కీలకమైన న్యాయవాదిగా గుర్తింపు పొందారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు. కారణం ఆయన చేసిన ట్వీట్ కలకలం రేపింది. ప్రత్యేకించి న్యాయం అందనప్పుడు, కనుచూపు మేరలో లేనప్పుడు ఆయుధం పట్టడమే మేలని పేర్కొన్నారు. న్యాయమూర్తి అయినా లేదా న్యాయవాది అయినా లేదా సామాన్యుడైనా సరే అందరికీ ఒక్కటే న్యాయం..ఒక్కటే చట్టం. కానీ ఇదంతా పక్కన పెట్టినట్టుంది . ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేని వాళ్లు, తీవ్రవాదులు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు, రాజ్యాంగం పట్ల వ్యతిరేక స్వభావం కలిగిన వాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పుడు ఎంతో పేరు పొందిన న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా కూడా ఆ గ్రూప్ లోకి చేరి పోయారని అనుకోవాలా.
చట్ట పరిధిలోనే కాదు చట్టానికి వ్యతిరేకంగా ఉన్న ఎంతటి బలవంతమైన కేసైనా ఇట్టే తన వాదనా పటిమతో గెలిపిస్తారనే పేరు తెచ్చుకున్నారు సిద్దార్థ్ లూథ్రా. ఆయనతో పాటు తన టీమ్ కు ఒక కేసు వాదిలంచాలంటే కోట్ల రూపాయలు సమర్పించు కోవాల్సిందేనన్న ప్రచారం లేక పోలేదు. ఎన్నో దిగ్గజ , సంచలన కేసులను వాదించి తనకు ఎదురే లేదని నిన్నటి దాకా అనుకుంటూ వచ్చిన సదరు న్యాయవాదికి కోలుకోలేని షాక్ తగిలింది ఏపీలోని ఏసీబీ కోర్టులో. ఆయన సామాన్యమైన వ్యక్తి కోసం రాలేదు. దేశ రాజకీయాలలో చక్రం తిప్పిన రాజకీయ నేతగా గుర్తింపు పొందిన TDP Chief , మాజీ ముఖ్యమంత్రి Nara Chandra Babu Naidu తరపున వాదించేందుకు వచ్చారు. ఏపీ సీఐడీ స్కిల్ స్కామ్ కేసులో అడ్డంగా బుక్ చేసింది. ఆపై ప్రధాన సూత్ర ధారి, పాత్రధారి బాబేనంటూ కేసు నమోదు చేసింది.
Siddarth Luthra & Scam Of 371 Cr
రూ. 371 కోట్ల రూపాయలు షెల్ కంపెనీల ద్వారా హవాలా రూపంలో చేతులు మారాయంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఇందుకు సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయని ప్రకటించింది. ఈ మేరకు 25 పేజీల రిమాండ్ రిపోర్టు ఏసీబీ కోర్టుకు సమర్పించింది. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఏపీ సీఐడీ తరపున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి వాదించారు. ఇక నారా చంద్రబాబు నాయుడు తరపున సుప్రీం కోర్టు లాయర్ సిద్దార్థ్ లూథ్రా , వెంకటేశ్వర్ రావు తమ వాదనలు వినిపించారు. ఆరున్నర గంటలకు పైగా వాదనలు సాగాయి. ఏసీబీ కోర్టు జడ్జి బీఎస్వీ హిమ బిందు సంచలన తీర్పు వెలువరించారు. చంద్రబాబు నాయుడుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పారు. అప్పటి దాకా కోర్టు బయట, లోపట హల్ చల్ చేస్తూ వచ్చిన సిద్దార్థ్ లూథ్రాకు తల కొట్టేసినంత పనైంది. కానీ ఎక్కడా తగ్గలేదు. తనకు ప్రాణ హాని ఉందంటూ మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గృహ నిర్బంధంలో ఉంచాలని కోరారు. కానీ ఏదీ వర్కవుట్ కాలేదు.
దీంతో తనను తాను గొప్పగా ఊహించుకున్న లూథ్రా ఫ్రస్ట్రేషన్ కు గురయ్యాడు. చివరకు సెన్సేషన్ అయ్యేలా ఆయుధం పట్టాలంటూ ట్వీట్ చేశాడు. సభ్య సమాజానికి ఏం చెప్పాలని అనుకున్నాడో ఆయనకే తెలియాలి. ఇప్పటికే సవాలక్ష అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయుడు తరపున వకల్తా పుచ్చుకోవడమే తప్పు. అలాంటిది ఇక ఆయుధాలు పట్టాలని పిలుపు నివ్వడం ఎంత వరకు సబబో ఆలోచించాలి. యువరానర్ ఆయుధం కాదు కావాల్సింది నీతి, న్యాయం, ధర్మం కావాలి.
Also Read : CV Anand : పరారీలో ఉన్న వారిని పట్టుకుంటాం