Tamil Directors Comment : వెండి తెరపై దర్శకులే హీరోలు
భిన్నమైన కథలకు పెట్టింది పేరు
Tamil Directors Comment : వాళ్లు దేనినైనా భరిస్తారు కానీ తమ ప్రాంతాన్ని, భాషను చులకన చేస్తే తట్టుకోలేరు. ఆ ప్రాంతం ఇప్పటికే ఏమిటో అర్థమై పోయి ఉంటుంది. అదే తమిళనాడు..ఇది సినీ రంగానికి పెట్టింది పేరు. అక్కడ ప్రతి ఒక్కరూ సినిమానే జీవితంగా..ప్రాణంగా భావిస్తారు. ఇప్పుడు భారత దేశంలో మోస్ట్ టాలెంటెడ్, క్రియేటివ్, డైరెక్టర్స్ తమ సత్తా ఏమిటో చూపిస్తున్నారు. ఇప్పటి దాకా సినీ రంగంలో హీరో, హీరోయిన్లను ప్రాతిపదికగా చేసుకుని సినిమాలు వచ్చాయి. అత్యున్నతమైన టెక్నాలజీ రావడంతో అది సినిమాను హై రేంజ్ కు తీసుకు వెళ్లేలా చేసింది. ఇప్పటికే తెలుగు సినీ రంగానికి సంబంధించి ఎస్ఎస్ రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు స్వంతం చేసుకుంది. ఇక సుకుమార్ తీసిన పుష్ప మూవీ రికార్డుల మోత మోగించింది. ఇక కన్నడ సినీ రంగానికి చెందిన ప్రశాంత్ నీల్ తీసిన కేజీఎఫ్ షేక్ చేసింది. ఎవరీ దర్శకుడు అని తన వైపు చూసేలా చేశాడు. Sandeep Reddy Vanga , Nag Aswin ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో డైరెక్టర్ ది ఒక్కో టేస్ట్.
Tamil Directors Comment & Importance
ఈ ఏడాది తమిళ సినిమాల పంట పండేలా చేయడంలో దర్శకులు కీలక పాత్ర పోషించారు. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన జవాన్ సెన్సేషన్ గా నిలిచింది. వేయి కోట్ల క్లబ్ లోకి దూసుకు పోతోంది. మరో వైపు నెల్సన్ దిలీప్ కుమార్ తీసిన జైలర్ రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్ర పోషించాడు.
ఒక రకంగా చెప్పాలంటే కోలీవుడ్ కు కొత్త రక్తం వచ్చిందని చెప్పక తప్పదు. ఇప్పటికీ వీరితో పోటీ పడుతున్నారు శంకర్, మణిరత్నం. ఇటీవల పొన్నియన్ సెల్వన్ మూవీ ఆశించిన దాని కంటే గొప్పగా ఆడింది. మరోసారి మణిరత్నం తన మార్క్ ఏమిటో చూపించాడు. లోకేష్ కనగరాజ్ , పా రంజిత్ , కార్తీక్ సుబ్బరాజ్ , తదితర యువ దర్శకుల హవా కొనసాగుతోంది. కొత్త కథలతో తమిళ సినీ ఇండస్ట్రీని శాసిస్తున్నారు. కమల్ హాసన్ తో తీసిన విక్రమ్ సూపర్ సక్సెస్ గా నిలిచింది. దీనికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు.
ఇక పా రంజిత్ సామాజిక నేపథ్యం కలిగిన సినిమాలకు ప్రయారిటీ ఇస్తాడు. ఇక జ్ఞానవేల్ తీసిన జై భీమ్ చిత్రం దేశ, విదేశాల ప్రశంసలు అందుకుంది. పా రంజిత్ విషయానికి వస్తే రజనీకాంత్ తో తీసిన కాలా సెన్సేషన్. సర్పత్తా, నచ్చతిరమ్ నగరిరత్తు వంటి చిత్రాలతో పేరు పొందాడు.
ప్రస్తుతం విక్రమ్ తో మూవీ చేస్తున్నాడు. హెచ్. వినోత్ తాజాగా అజిత్ తో సినిమా తీస్తున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ రూ. 25 కోట్లకు పైగానే తీసుకుంటున్నట్లు టాక్. పిజ్ఞా, పెట్టా, మహాన్ , జగమే తంతిరం సినిమాలతో పేరు పొందాడు కార్తీక్ సుబ్బరాజ్. ఇప్పుడు సీక్వెల్ తీస్తున్నాడు. వీరం, వివేగం, విశ్వాసం , అన్నత్తి వంటి మూవీస్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు మాస్ మూవీ డైరెక్టర్ శివ.
సూర్యతో సినిమా తీస్తూ బిజీగా మారి పోయాడు. ఆడు కాలం, విసర్నై , వడ చెన్నై , అసురన్ వంటి హిట్ సినిమాలు తీసిన వెట్రి మారన్ కు హెవీ డిమాండ్ ఉంటోంది. అట్లీ, లోకేష్ రూ. 50 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్. శంకర్ రూ. 60 కోట్లకు పై మాటేనని టాక్. ఏది ఏమైనా యువ దర్శకుల హవా కోలీవుడ్ ను ఊపేస్తోంది. కథలో దమ్ముంటే చాలు సినిమాకు కోట్లు రావడం ఖాయమంటున్నారు. నిజం కదూ..!
Also Read : Mallikarjun Kharge : పేర్లు మారిస్తే దేశం బాగుపడుతుందా