Bihar CM : బీహార్ – కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడంపై స్పందించారు బీహార్ సీఎం నితీశ్ కుమార్(Bihar CM). గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. బిల్లుకు తాను కూడా మద్దతు ఇస్తున్నానని తెలిపారు. అయితే ప్రస్తుతం రూపొందించిన బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు ప్రాతినిధ్యం ఎక్కడ ఉందంటూ ప్రశ్నించారు. ఇదంతా కావాలని తయారు చేశారంటూ మండిపడ్డారు.
Bihar CM Comments Viral
75 ఏళ్లకు పైగా అవుతోంది దేశానికి స్వేచ్ఛ లభించి. కానీ ఇప్పటి దాకా ఒక వర్గానికి చెందిన వారే లబ్ది పొందుతూ వచ్చారంటూ ఆరోపించారు. అణగారిన, బహుజనులకు సంబంధించిన వర్గాలు తీవ్ర వివక్షకు లోనవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే భారత రాజ్యాంగం ఆయా వెనుకబడిన జాతులకు సరైన ప్రాతినిధ్యం ఉండాలని పేర్కొందని గుర్తు చేశారు. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పుడో రావాల్సి ఉందని, కానీ ఇప్పుడైనా వచ్చినందుకు కొంత ఆనందంగా ఉందన్నారు.
ఈ దేశంలో ఇప్పటికీ కులాల ఆధిపత్యం ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. దీనిని రూపు మాపితేనే అన్ని వర్గాలకు సమ న్యాయం దక్కుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు బీహార్ సీఎం.
Also Read : Nandamuri Balakrishna : వాళ్లు తొడగొడితే నేను మీసం తిప్పా
