TSRTC : టీఎస్ఆర్టీసీ ఖుష్ క‌బ‌ర్

ప్ర‌యాణీకుల‌కు రాయితీ

TSRTC : హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ తీపి క‌బురు చెప్పింది. గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ స‌జ్జ‌నార్(TSRTC MD) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాబోయే ద‌స‌రా పండుగ‌ను దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాల‌కు వెళ్లే ప్ర‌యాణీకుల‌కు శుభ వార్త తెలిపారు.

TSRTC Offer for Dussera

ఈ మేర‌కు ఆర్టీసీ సంస్థ ఆధ్వ‌ర్యంలో న‌డిచే బ‌స్సుల‌లో మెరుగైన వ‌స‌తి సౌక‌ర్యాల‌ను క‌ల్పించ‌డం జ‌రిగింద‌న్నారు. నూత‌నంగా బ‌స్సుల‌ను ఇప్ప‌టికే ప్రారంభించామ‌ని తెలిపారు. అంతే కాకుండా ఇటీవ‌ల తాము ప్ర‌యాణం చేస్తున్న బ‌స్సుల ప్ర‌యాణించే దూరం, ఆయా ప్రాంతాల‌కు చేరుకునే స‌మ‌యం కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకునే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌న్నారు.

తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నామ‌ని స్ప‌ష్టం చేశారు ఎండీ. విజ‌య ద‌శ‌మి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని ముంద‌స్తు టికెట్లు బుకింగ్ చేసుకుంటే ఆర్టీసీ త‌ర‌పున 10 శాతం రాయితీ ఇస్తున్న‌ట్లు తెలిపారు. అక్టోబ‌ర్ 15 నుండి 29 మ‌ధ్య ప్ర‌యాణించే వారికి ఇది వ‌ర్తిస్తుంద‌ని పేర్కొన్నారు.

అయితే సెప్టెంబ‌ర్ 30వ తేదీ లోపు బుకింగ్ చేసుకుంటేనే ఈ రాయితీ వ‌ర్తిస్తుంద‌ని , దీనిని ప్ర‌యాణీకులు గ‌మ‌నించాల‌ని సూచించారు ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్.

Also Read : Bihar CM : అణ‌గారిన మ‌హిళ‌ల‌కు గుర్తింపేది

Leave A Reply

Your Email Id will not be published!