Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.77 కోట్లు
తిరుమలను దర్శించుకున్న భక్తులు 66,462
Tirumala Rush : తిరుమల – పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమల భక్తులతో నిండి పోయింది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమల. శ్రీ వేంకటేశ్వర స్వామి , శ్రీ అలివేలు మంగమ్మలను 66 వేల 462 మంది దర్శించుకున్నారు.
29 వేల 241 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిత్యం భక్తులు శ్రీనివాసుడికి సమర్పించే కానుకలు, విరాళాల రూపేనా సమర్పించే హుండీ ఆదాయం రూ. 2.77 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది.
Tirumala Rush with Devotees
తిరుమలలోని టీబీసీ వరకు భక్తులు వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేకుండా స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 24 గంటలకు పైగా పడుతుందని టీటీడీ(TTD) స్పష్టం చేసింది. ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.
ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున టీటీడీ ఏర్పాట్లు చేసింది. సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టినట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి. భక్తుల భద్రత దృష్ట్యా కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పారు.
అలిపిరి మెట్లు, శ్రీవారి మెట్ల ద్వారా తిరుమలకు నడిచి వచ్చే భక్తులకు చేతి కర్రలు ఇస్తున్నట్లు తెలిపారు.
Also Read : Justin Trudeau : భారత్ పై భగ్గుమన్న జస్టిన్ ట్రూడో