Justin Trudeau : భార‌త్ పై భ‌గ్గుమ‌న్న జ‌స్టిన్ ట్రూడో

మ‌రోసారి నోరు పారేసుకున్న పీఎం

Justin Trudeau : కెన‌డా ప్ర‌ధాన మంత్రి జ‌స్టిన్ ట్రూడో షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న మ‌రోసారి నోరు పారేసుకున్నారు. భార‌త దేశానికి వ్య‌తిరేకంగా కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇప్ప‌టికే పంజాబ్ కు చెందిన కెన‌డియ‌న్ సిక్కు పౌరుడిని అకార‌ణంగా హ‌త్య చేశారంటూ ఆరోప‌ణ‌లు చేశారు.

ఇదే స‌మ‌యంలో దీనికి ప్ర‌ధాన కార‌ణం ఇండియానేనంటూ ఏకంగా కెన‌డాలో ఉన్న భార‌త దేశానికి చెందిన దౌత్య‌వేత్త‌ను బ‌హిష్క‌రించారు.

Justin Trudeau Comments Viral

హ‌ర్దీప్ సింగ్ నిజ్జ‌ర్ హ‌త్య వెనుక భార‌త ప్ర‌భుత్వ హ‌స్తం ఉందంటూ మండిప‌డ్డారు కెన‌డా ప్ర‌ధాన మంత్రి. ఆయ‌న అంత‌ర్జాతీయ మీడియాతో మాట్లాడారు. అంత‌ర్జాతీయ నిబంధ‌న‌ల ఆధారిత ఆర్డ‌ర్ కు త‌మ దేశం అండ‌గా నిలుస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు.

నిజ్జ‌ర్ హ‌త్యకు సంబంధించి త‌మ వ‌ద్ద బ‌ల‌మైన ఆధారాలు ఉన్నాయ‌ని చెప్పారు జ‌స్టిన్ ట్రూడో(Justin Trudeau). న్యూయార్క్ లోని ఐక్య రాజ్య స‌మితిలో కెన‌డా శాశ్వ‌త మిష‌న్ లో ఈ విష‌యంపై వ్యాఖ్యానించారు.

ఇరు దేశాలు ప‌ర‌స్ప‌ర చ‌ర్య‌ల‌కు దిగాయి. దీంతో దౌత్య ప‌ర‌మైన ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్న ప్ర‌స్తుత త‌రుణంలో మ‌రోసారి భార‌త్ పై త‌న అక్క‌సు వెళ్ల‌గ‌క్క‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది భార‌త ప్ర‌భుత్వం.

Also Read : Govt Of India : మీడియా గీత దాటితే జాగ్ర‌త్త

Leave A Reply

Your Email Id will not be published!