Chandra Babu Naidu Comment : కల చెదిరింది కథ మారింది
బాబుకు దిక్కేది టీడీపీకి దారేది
Chandra Babu Naidu Comment : రాజకీయ, సినీ, క్రీడా రంగాలు ఒకే లాగా ఉంటాయి. ఎందుకంటే ఈ రంగాలన్నీ అత్యంత జనాదరణను కలిగి ఉంటాయి. అందుకే ఈ రంగాలలో ఉన్న వారు అత్యంత ఎత్తులో ఉన్నామని, తాము అన్నింటికీ అతీతులమని అనుకుంటారు. అలా భ్రమ పడుతుంటారు. ఎవరైనా సరే సక్సెస్ లో ఉన్నప్పుడు మాత్రమే పల్లకీ మోసేందుకు ముందుకు వస్తుంటారు. ఒక్కసారి కింద పడి పోయారంటే తన వెంట ఉన్నవారు, భజనపరులు, ఆహా ఓహో అంటూ కీర్తించిన వాళ్లు, మందీ మార్బలం అంతా సైడ్ అయి పోతారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఇది సరిగ్గా సరి పోతుంది 45 ఏళ్ల రాజకీయ చరిత్ర, అంతకు మించిన అనుభవం కలిగిన తెలుగుదేశం పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు(Chandrababu Naidu) వర్తిస్తుంది. ఇది ఒక రకంగా ఆయనను అనుసరిస్తున్న నేతలు, కార్యకర్తలు, అభిమానులకు, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సామాజిక వర్గానికి మింగుడు పడక పోయినా తట్టుకుని తీరాల్సిందే.
Chandra Babu Naidu Comment Viral
చాలా మంది విజేతలని అనుకుంటారు. తమ చేతిలో పవర్ ఉంది కదా అని సంచలన నిర్ణయాలతో హోరెత్తిస్తుంటారు. కానీ అది కొంత మేరకే. కాలం అనే పరీక్షలో ఒక్కోసారి విజయం వరిస్తుంది. ఇంకోసారి అపజయం పలకరిస్తుంది. ఉదాహరణకు ప్రపంచ క్రికెట్ లో వస్తూనే విస్తు పోయేలా రికార్డ్ సృష్టించిన హైదరాబాదీ మణికట్టు మాంత్రికుడు మహమ్మద్ అజహరుద్దీన్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయనను బెట్టింగ్ భూతం కమ్మేసింది. కానీ తనను తాను ప్రూవ్ చేసుకునేంత వరకు ఒంటరి పోరాటం చేశాడు. మళ్లీ దెబ్బ తిన్న పులిలా బయటకు వచ్చాడు. కానీ ఎక్కడా తగ్గలేదు. 1983లో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించాడు. కానీ ఇదే సమయంలో ఆయన మాట తూలారు. తాను కుక్కను పోటీకి నిలబెట్టినా గెలుస్తానని ప్రకటించాడు. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లా కల్వకుర్తిలో చెప్పుతో కొట్టారు. ఎన్టీఆర్ ను ఓడించారు.
చెప్పులు వేసిన వాళ్లు, రాళ్లు కురిపించిన వాళ్లు చివరకు పూలు కూడా కురిపించిన దాఖలాలు కోకొల్లలు. తనకు అండగా ఉంటూ వచ్చిన ఈనాడు గ్రూప్ సంస్థల యజమాని రామోజీరావు పరిస్థితి కూడా భిన్నంగా ఉంది. రాజగురువుగా పేరు పొందిన ఆయన కూడా చివరకు మంచం మీద ఎక్కే పరిస్థితికి తీసుకు వచ్చేలా చేసింది. ఇదంతా కాలపు మహిమ. తనకు ఎదురే లేదంటూ నిన్నటి దాకా నమ్మకంతో ఉన్న చంద్రబాబు నాయుడుకు(Chandrababu Naidu) ఇప్పుడు జగన్ రూపంలో తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. నువ్వా నేనా అంటూ సవాళ్లు విసురుకున్నా చివరకు తాను ఊహించని రీతిలో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండడం కలలో కూడా అనుకోలేదు. సుప్రీంకోర్టులో అత్యున్నతమైన న్యాయవాదులుగా పేరు పొందిన సిద్దార్థ్ లూత్రా, హరీష్ సాల్వే లాంటి వాళ్లు వాదించినా చివరకు ఆయనను బయటకు తీసుకు రాలేక పోయారు. అందుకే కాలం ఎప్పటి లాగా ఉండదని ఇప్పటికైనా తెలుసు కోక తప్పదు. తను కోరుకున్న ప్రచారం తనకు ముప్పుగా మారిందని గుర్తిస్తే బెటర్.
Also Read : RK Roja Selvamani : బాలయ్య చిల్లర చేష్టలు మానుకో