Nagendra Babu : జనసేన కార్యకర్తలే పార్టీకి బలగం
పార్టీ ప్రధాన కార్యదర్శి నాగ బాబు
Nagendra Babu : చిత్తూరు – జనసేన పార్టీకి కార్యకర్తలే బలమని స్పష్టం చేశారు పార్టీ ప్రధాన కార్యదర్శి నాగేంద్ర బాబు. ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇక నుంచి రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు అంకిత భావంతో పని చేయాలని పిలుపునిచ్చారు.
Nagendra Babu Comment
జనసేన కార్యకర్తలు లేక పోతే పార్టీ లేదన్నారు. పార్టీ సిద్దాంతాలు, భావ జాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకు పోవాలని కోరారు నాగబాబు. ఒక్కొక్కరు పది మందితో ఓటు వేయించేలా చేయాలని అన్నారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన అంశాలను, సమస్యలను వివరించాల్సిన బాధ్యత మీపైనే ఉందని స్పష్టం చేశారు.
ఒక్కో కార్యకర్త పది మందితో ఓటు వేయించేలా ప్రయత్నం చేయాలని అన్నారు పార్టీ ప్రధాన కార్యదర్శి నాగేంద్ర బాబు(Nagendra Babu). ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించాలంటే మనందరం కలిసి కట్టుగా పని చేయాలని పేర్కొన్నారు.
ఇప్పటికే మన పార్టీ చీఫ్ తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేసేందుకు సంసిద్దత వ్యక్తం చేశారని ఇందుకు సంబంధించి సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని స్పష్టం చేశారు.
Also Read : BCCI Comment : క్రికెట్ పండుగ సరే సెలెక్షన్ మాటేంటి