BCCI Selection : సూర్యపై ప్రేమ సంజూపై కక్ష
కొనసాగుతున్న బీసీసీఐ వివక్ష
BCCI Selection : బీసీసీఐ సెలెక్షన్ కమిటీ అనుసరిస్తున్న విధానం గత కొన్నేళ్లుగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రతిభాంతులైన క్రికెటర్లు లెక్కకు మించి ఉన్నారు. కేవలం ముంబైకి చెందిన ఆటగాళ్లకే ప్రయారిటీ ఇవ్వడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది.
ప్రత్యేకించి కేరళ స్టార్ క్రికెటర్ , రాజస్థాన్ రాయల్స్ జట్టు స్కిప్పర్ సంజూ శాంసన్ విషయంలో బీసీసీఐ అనుసరిస్తున్న విధానం పూర్తిగా వివక్షా పూరితంగా ఉందంటూ భారత క్రికెట్ కు చెందిన మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు.
BCCI Selection Viral
వన్డే ఫార్మాట్ లో అద్బుతంగా రాణిస్తున్నా, అపారమైన అనుభవం ఉన్నప్పటికీ పనిగట్టుకుని అతడిని పక్కన పెట్టడంపై మండి పడుతున్నారు. కొంత మంది ఆటగాళ్లు రాణించక పోయినా కంటిన్యూ చేస్తూ వస్తున్న బీసీసీఐ(BCCI) ఒకటి లేదా రెండు మ్యాచ్ లలో రాణించక పోతే పక్కన పెట్టేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు.
విచిత్రం ఏమిటంటే సూర్య కుమార్ యాదవ్ పై ఉన్నంత ప్రేమ ఎందుకని సంజూ శాంసన్ విషయంలో ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా బీసీసీఐ తన ఎంపిక తీరును మార్చుకుంటే బెటర్ అని పేర్కొంటున్నారు.
Also Read : Team India Changes : రెండో వన్డేలో కీలక మార్పులు