Naga Babu : సీఎం ఎవ‌ర‌నేది కాలమే నిర్ణ‌యిస్తుంది

జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగ బాబు

Naga Babu : తిరుప‌తి – ఆంధ్ర ప్ర‌దేశ్ లో వ‌చ్చే ఎన్నిక‌లు అత్యంత కీల‌కంగా మార బోతున్నాయ‌ని పేర్కొన్నారు జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగ బాబు(Naga Babu). ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీకి సంబంధించి అభ్య‌ర్థులు ఎవ‌ర‌నే దానిపై నిర్ణ‌యం తీసుకుంటార‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎవ‌రి జోక్యం ఉండ‌ద‌న్నారు.

Naga Babu Comments Viral

వైసీపీ నేత‌లు త‌మ వారిపై కేసులు పెట్టిస్తున్నార‌ని, కానీ తాము భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తి లేద‌న్నారు నాగ‌బాబు. ఇక సీఎం ఎవ‌రు అవుతార‌నే దానిపై తాము చెప్ప‌లేమ‌న్నారు. అది ఎవ‌రు కావాల‌నే దానిపై కాల‌మే నిర్ణ‌యిస్తుంద‌ని చెప్పారు నాగ‌బాబు.

ఎన్నిక‌లయ్యాక త‌మ శ‌క్తిని బ‌ట్టి భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ ఉంటుంద‌న్నారు. సీఎం కావాల‌ని, ప‌వ‌ర్ ను చేజిక్కించు కోవాల‌ని త‌మ నాయ‌కుడు ప‌వ‌న్ కు లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. జ‌న‌సేన పార్టీలో నాయ‌క‌త్వ లోపం లేద‌న్నారు. బ‌ల‌మైన నాయ‌కులుగా జ‌న సైనికులు ఎదుగుతున్నార‌ని చెప్పారు నాగ బాబు.

చంద్ర‌బాబు నాయుడును అక్ర‌మంగా అరెస్ట్ చేశార‌ని, అందుకే ఆయ‌న‌కు, పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చామ‌న్నారు . ఇందులో రాజ‌కీయం ఏం ఉంటుంద‌ని ప్ర‌శ్నించారు. టీడీపీకి దెబ్బ త‌గిలింద‌ని జ‌న‌సేన అవ‌కాశ‌వాద రాజ‌కీయాలు చేయ‌ద‌న్నారు. బీజేపీతో పొత్తు విష‌యంపై త్వ‌ర‌లో క్లారిటీ వ‌స్తుంద‌న్నారు.

Also Read : Mothkupalli Narsihmulu : చంద్ర‌బాబు అరెస్ట్ అన్యాయం

Leave A Reply

Your Email Id will not be published!