Kotha Manohar Reddy : కొత్త మనోహర్ రెడ్డిపై వేటు
పార్టీ నుండి సస్పెండ్
Kotha Manohar Reddy : హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన కొత్త మనోహర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్, మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు ఎనుముల రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.
Kotha Manohar Reddy Got Suspended
త్వరలో రాష్ట్రంలో జరగబోయే శాసన సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపునకు సంబంధించి ఒక్కొక్కరి వద్ద నుంచి కోట్లాది రూపాయలు రేవంత్ రెడ్డి వసూలు చేస్తున్నారంటూ కామెంట్స్ చేశారు. ఈ విషయం గురించి తనతో ఢిల్లీలో టీపీసీసీ మాజీ చీఫ్ వి. హనుమంత్ రావు ప్రశ్నించారని కూడా చెప్పారు కొత్త మనోహర్ రెడ్డి.
రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకునే దుకాణం ఓపెన్ చేశాడని, ఒక్కొక్కరి వద్ద నుంచి సుమారు రూ.10 కోట్ల చొప్పున వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. దీంతో కొత్త మనోహర్ రెడ్డి(Kotha Manohar Reddy) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పార్టీ ఎలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వకుండానే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు కొత్త మనోహర్ రెడ్డిపై వేటు వేసినట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ప్రకటించారు. ఇదిలా ఉండగా కొత్త మనోహర్ రెడ్డి భారత రాష్ట్ర సమితి పార్టీలో ఉన్నారు. ఆయన ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడిగా గుర్తింపు పొందారు. ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు.
Also Read : Justice SV Bhatti Comment : ఎవరీ జస్టిస్ భట్టి ఏమిటా కథ