Mallikarjun Kharge : ఇండియా కూటమి గెలుపు ఖాయం
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
Mallikarjun Kharge : న్యూఢిల్లీ – ప్రతిపక్షాలతో కూడిన కూటమి ఇండియా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందడం పక్కా అని జోష్యం చెప్పారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge). దేశంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు.
Mallikarjun Kharge Comment on India Alliance
గురువారం మల్లికార్జున్ ఖర్గే జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఉన్న సభ్యులలో ఎక్కువ మంది ఎంపీలను కలిగి ఉన్నారనే ధీమాతో తమకు తోచినట్లుగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ఇదే సమయంలో ప్రతిపక్షాలకు కూడా అదే రీతిలో హక్కులు ఉంటాయన్న సంగతి ప్రధాన మంత్రి మోదీ తెలుసు కోవడం లేదని మండిపడ్డారు. తాము మౌనంగా చూస్తూ ఊరుకోలేమని పేర్కొన్నారు. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు మల్లికార్జున్ ఖర్గే.
భారత కూటమిని చూస్తే లెక్కలు, ఓటింగ్ సరళి చూస్తుంటే కలిసికట్టుగా పోరాడితే విజయం సాధిస్తామన్నారు. ఈసారి ఎన్డీఏఐపై తాము ఆధిపత్యం ఉంటుందన్నారు ఏఐసీసీ చీఫ్.
Also Read : MS Swaminathan : హరిత పితామహుడు ఇక లేడు