Nara Lokesh : నారా లోకేష్ కు కోర్టు ఊరట
ఫైబర్ గ్రిడ్ కేసుపై విచారణ
Nara Lokesh : అమరావతి – టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఊరట లభించింది. ఫైబర్ గ్రిడ్ కేసులో ఇంకా కేసు నమోదు చేయలేదని కోర్టులో ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది వెల్లడించారు. ఇదే కేసుకు సంబంధించి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ నారా లోకేష్ ఇటీవలే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Nara Lokesh May got Relief
లోకేష్ తరపు న్యాయవాదులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. నారా ను అరెస్ట్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోందని, దీంతో ఆయన ఆందోళనకు లోనవుతున్నారని లోకేష్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
కాగా ఆయనను ఇంత వరకు ఫైబర్ గ్రిడ్ కేసులో నిందితుడిగా చేర్చ లేదని స్పష్టం చేశారు సర్కార్ న్యాయవాది. ఒకవేళ చేరిస్తే నారా లోకేష్(Nara Lokesh) కు సీఆర్పీసీలోని 41ఎ కింద నోటీసులు ఇస్తామన్నారు. ఒకవేళ 41ఎ నిబంధనలు పాటించక పోతే కోర్టుకు విన్నవిస్తామని చెప్పారు న్యాయవాది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ కేసుకు సంబంధించి ఎ14గా చేర్చారు పోలీసులు. ఆయనకు నోటీసు కూడా ఇచ్చారు.
Also Read : Seeman Satya Raj : ప్రజా కళాకారుడు సత్యరాజ్