Pawan Kalyan : ఎన్డీయే కూట‌మికి గుడ్ బై – ప‌వ‌న్

జ‌న‌సేన పార్టీ చీఫ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

Pawan Kalyan : అమ‌రావ‌తి – జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. నిన్న‌టి దాకా కేంద్రంలో కొలువు తీరిన మోదీ , బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ (ఎన్డీఏ)లో కీల‌క‌మైన భాగ‌స్వామిగా ఉంటూ మ‌ద్ద‌తు ఇస్తూ వ‌చ్చిన జ‌న‌సేన పార్టీ చీఫ్ ఉన్న‌ట్టుండి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Pawan Kalyan Exit from NDA

గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఎన్డీయే కూటమి నుండి తాను బ‌యట‌కు వ‌చ్చాన‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బ‌ల‌హీనంగా ఉంద‌ని, దీంతో ఆ పార్టీ అనుభ‌వం, జ‌న‌సేన పోరాటం క‌లిసి ముందుకు వెళ్లాల‌ని తాను నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan).

రాష్ట్రంలో రాక్షస పాల‌న సాగిస్తున్న ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని పాతాళానికి తొక్కేయాల‌న్న‌దే త‌న అంతిమ ల‌క్ష్య‌మ‌ని ప్ర‌క‌టించారు జ‌న‌సేనాని. అందుకే తాను ఎన్డీయే నుండి దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాన‌ని తెలిపారు.

టీడీపీ, జ‌న‌సేన ఇక నుంచి కలిసే పోటీ చేస్తాయ‌ని, క‌లిసే నిర్ణ‌యాలు తీసుకుంటామ‌ని చెప్పారు.ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం జ‌న‌సేన పార్టీ చీఫ్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

గ‌త కొన్నేళ్లుగా ప్ర‌ధాన మంత్రి మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో క‌లుస్తూ వ‌స్తున్నారు. ఏపీలో స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఈ నిర్ణ‌యం వెనుక ఏమై ఉంటుంద‌న్న ఉత్కంఠ ఆపార్టీ నేత‌ల్లో నెల‌కొంది.

Also Read : BJP Election Committee : బీజేపీ ఎన్నిక‌ల క‌మిటీ డిక్లేర్

Leave A Reply

Your Email Id will not be published!