Minister KTR : కేసీఆర్ ఖలేజా ఉన్నోడు – కేటీఆర్
దళితబంధు లాంటి స్కీం ఎక్కడా లేదు
Minister KTR : హైదరాబాద్ – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) సంచలన కామెంట్స్ చేశారు. గురువారం ఆయన తన తండ్రి, సీఎం కేసీఆర్ ను ప్రశంసలతో ముంచెత్తారు. రాష్ట్రంలో కొందరు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని కానీ వాళ్లకు అధికార యావ తప్ప విజన్ లేదన్నారు.
ఇవాళ యావత్ దేశం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తోందన్నారు. కారణం అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. సోయి లేనోళ్లు ఆరోపణలు చేస్తారని ఆరోపించారు.
Minister KTR Praises KCR
దళిత బంధు లాంటి స్కీం దేశంలో ఎక్కడా లేదన్నారు. ఇది కేవలం దమ్మున్న లీడర్ సీఎం కేసీఆర్ వల్లనే అవుతుందన్నారు. ఇంకే లీడర్ కు ఇలాంటి ఆలోచనలు రావన్నారు. ఎందుకంటే ఆయన ప్రజల కోసం పని చేస్తున్న నాయకుడని పేర్కొన్నారు.
ఉద్యమ నేపథ్యం ఉండడం వల్ల రాష్ట్రానికి ఏం కావాలనే దానిపై పూర్తి అవగాహన ఉందన్నారు. ఈ రోజు వరకు ఇలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి రాలేదన్నారు. చాలా మంది పాలన చేశారే తప్పా ప్రజల గురించి ఆలోచించ లేదన్నారు కేటీఆర్. దమ్మున్నోడు, ఖలేజా ఉన్నోడు కాబట్టే దళిత బంధు ప్రకటించారని చెప్పారు.
Also Read : Pawan Kalyan : ఎన్డీయే కూటమికి గుడ్ బై – పవన్
