High Security : హైద‌రాబాద్ లో హై అల‌ర్ట్

వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ ల‌కు భారీ భ‌ద్ర‌త

High Security : హైద‌రాబాద్ – అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఐసీసీ(ICC) వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 గురువారం ప్రారంభ‌మైంది. ఈ బిగ్ టోర్నీలో 10 జ‌ట్లు పాల్గొంటున్నాయి. ఇప్ప‌టికే ఐసీసీ ఆయా మ్యాచ్ ల షెడ్యూల్ ను ఖ‌రారు చేసింది. సుదీర్ఘ కాలం త‌ర్వాత దాయాది పాకిస్తాన్ జ‌ట్టు హైద‌రాబాద్ కు చేరుకుంది.

High Security Alert in Hyderabad

దీంతో భారీ ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. ఎక్క‌డా అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టారు. తాజాగా సీపీ డీఎస్ చౌహాన్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ ల‌కు భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు.

గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామ‌న్నారు. పెద్ద ఎత్తున పోలీసుల‌ను మోహ‌రించామ‌న్నారు. ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని తెలిపారు.

మొత్తం 1200 మంది పోలీసుల‌తో బందోస్తు ఏర్పాటు చేశామ‌న్నారు. ఒక‌వేళ అవ‌స‌రమ‌ని అనిపిస్తే మ‌రింత సెక్యూరిటీని పెంచుతామ‌ని చెప్పారు సీపీ డీఎస్ చౌహాన్. ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తి ఇస్తామ‌ని తెలిపారు. కంట్రోల్ రూమ్ ద్వారా భ‌ద్ర‌త‌ను మానిట‌రింగ్ చేస్తామ‌న్నారు.

Also Read : AP CM YS Jagan : ఢిల్లీకి చేరుకున్న సీఎం జ‌గ‌న్

Leave A Reply

Your Email Id will not be published!