Nagam Janardhan Reddy : టికెట్లు అమ్ముకుంటున్న రేవంత్
నాగం జనార్దన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
Nagam Janardhan Reddy : హైదరాబాద్ – మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. తాజాగా ఏఐసీసీ సీఈసీ ప్రకటించిన తొలి జాబితాలో నాగర్ కర్నూల్ నియోకవర్గం నుంచి తనతో పాటు కొడుకుకు టికెట్ వస్తుందని ఆశించారు. విచిత్రంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జంప్ అయ్యారు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి. ఆయన తనయుడు కూచుకుళ్ల రాజేశ్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి టికెట్ కేటాయించారు.
Nagam Janardhan Reddy Comments on Revanth Reddy
సుదీర్గమైన రాజకీయ చరిత్ర ఉంది నాగం జనార్దన్ రెడ్డికి(Nagam Janardhan Reddy). తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2గా ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కొత్త పార్టీ పెట్టారు. దానిని బంద్ పెట్టి భారతీయ జనతా పార్టీలో చేరారు. దానికి గుడ్ బై చెప్పారు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గత కొంత కాలం నుంచీ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ పై, సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వచ్చారు.
రేవంత్ రెడ్డి నమ్మక ద్రోహి అని, డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తుందో తాను చూస్తానంటూ సవాల్ విసిరారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా పైసలు ఇచ్చినోళ్లకు మాత్రమే టికెట్లు ఇచ్చారంటూ ధ్వజమెత్తారు. దామోదర్ రెడ్డికి సపోర్ట్ చేసి గెలిపిస్తే తను తాను ఓడి పోయేందుకు ప్రయత్నం చేశాడంటూ ఆరోపించారు.
Also Read : Telangana Jobs Comment : జాబ్స్ జాడేది నిరుద్యోగులకు దిక్కేది