Sunny Deol : హైదరాబాద్ – ప్రముఖ నటుడు, ఎంపీ సన్నీ డియోల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో సినిమా షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చానని, కానీ అప్పటికీ ఇప్పటికీ చూస్తే ఊహించని రీతిలో అభివృద్ది జరిగిందని కితాబు ఇచ్చారు. సన్నీ డియోల్ మీడియాతో మాట్లాడారు.
Sunny Deol Comment about Hyderabad development
హైదరాబాద్ ను చూస్తుంటే తాను నమ్మ లేక పోయానని అన్నారు. ఇక్కడే ఇల్లు తీసుకుని, స్థిర పడాలనే కోరిక తనలో కలిగిందని చెప్పారు సన్నీ డియోల్(Sunny Deol). గణనీయంగా అభివృద్ది జరిగిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది అమెరాకాను తలపింప చేస్తోందని కితాబు ఇచ్చారు నటుడు.
ఇదిలా ఉండగా సీనియర్ నటుడు ధర్మేంద్ర తనయుడే సన్నీ డియోల్. ఆయన పలు విజయవంతమైన చిత్రాలలో నటించారు. బాలీవుడ్ లో టాప్ హీరోలలో ఒకడిగా కొనసాగుతున్నారు. అంతే కాదు ఎంపీగా కూడా కొనసాగుతున్నారు. ఇటీవలే అమీషా పటేల్ తో కలిసి గదర్ -2 సీక్వెల్ చిత్రంలో నటించారు.
ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సందర్బంగా తన సినిమాను ఆదరించి, బిగ్ సక్సెస్ చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు వల్లమాలిన అభిమానమని చెప్పారు సన్నీ డియోల్.
Also Read : Medigadda Row : మేడిగడ్డ ఘటనపై కేసు నమోదు