Gorantla Madhav : బాబు చస్తాడు జగన్ సీఎం అవుతాడు
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కామెంట్స్
Gorantla Madhav : వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. వచ్చే ఏడాది 2024లో జరిగే శాసనసభ ఎన్నికల్లో తిరిగి వైసీపీ పవర్ లోకి వస్తుందన్నారు.
Gorantla Madhav Slams Chandrababu
చంద్రబాబు నాయుడు చావడం ఖాయమని, జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఏపీకి సీఎం అవుతారంటూ జోష్యం చెప్పారు గోరంట్ల మాధవ్(Gorantla Madhav). ఏపీ స్కిల్ స్కాం కేసులో అక్రమాలకు పాల్పడినందు వల్లనే చంద్రబాబు జైలులో ఉన్నారని పేర్కొన్నారు.
అంతే కాదు ఈ ఒక్క స్కామ్ తో పాటు ఫైబర్ నెట్ స్కాం, అమరావతి రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ స్కాంలో కూడా కీలకమైన పాత్ర పోషించారని ఆరోపించారు. ఈ విషయాలను తాను చెప్పడం లేదని , ఏపీ సీఐడీ ఇప్పటికే ప్రకటించిందని స్పష్టంచేశారు.
తన జీవిత కాలంలో ఎక్కువగా దోచు కోవడానికే ప్రయారిటీ ఇచ్చాడని, దానిని దాచుకునేందుకు అధికారాన్ని వాడుకున్నాడని ఆరోపించారు గోరంట్ల మాధవ్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
Also Read : G Kishan Reddy : రాహుల్ రాజకీయ అజ్ఞాని