G Kishan Reddy : హైదరాబాద్ – ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ జి. కిషన్ రెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీకి రాజకీయ పరిజ్ఞానం లేదని ఆరోపించారు.
G Kishan Reddy Comments on Rahul Gandhi
ఎవరో రాసి ఇచ్చే స్క్రిప్టు చదవడం తప్ప ఇంకోటి తెలియదని ఎద్దేవా చేశారు జి. కిషన్ రెడ్డి(G Kishan Reddy). చదవడం తప్ప ఆయనకు రాయడం కూడా రాదన్నారు. ముందు వెనుకా చూసుకోకుండా ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు .
భారత్ జోడో పేరుతో యాత్ర చేపట్టినంత మాత్రాన ఒరిగింది ఏమీ లేదన్నారు బీజేపీ చీఫ్. కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీలు అవినీతికి పుట్టిన కవల పిల్లలు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ తమ పార్టీపై చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ ఎవరికీ గులాం చేయదన్నారు. బీఆర్ఎస్ కు బీ టీమ్ కాదని స్పష్టం చేశారు గంగాపురం కిషన్ రెడ్డి. ఆరు గ్యారెంటీల పేరుతో మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు.
సమాచారం లేకుండా మాట్లాడటం రాహుల్ గాంధీకి ఫ్యాషనై పోయిందంటూ సెటైర్ వేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ పవర్ లోకి వస్తుందని జోష్యం చెప్పారు.
Also Read : Congress List : ఖరారు కాని కాంగ్రెస్ లిస్టు
