విశాఖ‌లో పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్

ప్రారంభించిన ఐటీ , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్

విశాఖ‌పట్నం జిల్లా : విశాఖపట్నంలో పి.వి. సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ కు సంబంధించిన ప్రణాళికను బుధ‌వారం ఆవిష్క‌రించారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఇది ఏడు రకాల క్రీడా విభాగాలు, అత్యున్నత స్థాయి శిక్షణ , క్రీడా విజ్ఞానం, రికవరీ, పోషకాహారం, శారీరక దృఢత్వం, విద్యాబోధనను ఒకే ప్రాంగణంలోకి తీసుకు వస్తుంది. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో మంత్రితో పాటు ప్రముఖ టెన్నిస్ తార పీవీ సింధు పాల్గొన్నారు. క్రీడా అభివృద్ధిని పునర్నిర్వచించే లక్ష్యంతో ఒక కీలకమైన లాభాపేక్ష లేని సంస్థగా దీనిని ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించారు మంత్రి. ఆయ‌న పీవీ సింధును అభినందించారు. ఇదిలా ఉండ‌గా రెండుసార్లు ఒలింపిక్ పతకం సాధించారు దేశానికి గ‌ర్వ కార‌ణంగా నిలిచారు త‌ను.

ఈ కేంద్రం క్రీడలు, విద్యల సమగ్ర వ్యవస్థగా రూపుదిద్దుకుంటోంది. దీని నిర్మాణం ఇప్పటికే వేగంగా సాగుతోంద.. బేస్‌మెంట్ , సబ్‌స్ట్రక్చర్ పనులు పూర్తయ్యాయి, సూపర్‌స్ట్రక్చర్ రూపుదిద్దుకుంటోంది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుతో జరిపిన చర్చల తర్వాత ఈ ప్రాజెక్ట్ లక్ష్యాలు మరింత విస్తృతమయ్యాయి. కేవలం రాబోయే కొన్నేళ్ల గురించే కాకుండా, రాబోయే వంద సంవత్సరాల గురించి ఆలోచించమని ఆయన సింధును, ఆమె భర్త వెంకట దత్త సాయిని ప్రోత్సహించారు. ఒక బ్యాడ్మింటన్ అకాడమీగా ప్రారంభమైన ఇది, ఇప్పుడు తరతరాల క్రీడాకారులు , విద్యార్థులకు సేవలందించేలా రూపొందించబడిన ఒక దీర్ఘకాలిక సంస్థగా ఎదిగింది.

దోహాలోని ఆస్పెటార్, ‘ఇన్‌స్పైర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్’ వంటి ప్రపంచ స్థాయి క్రీడా కేంద్రాలను సందర్శించి స్ఫూర్తి పొందింది ఈ కేంద్రం. శిక్షణ, విజ్ఞానం, రికవరీ, విద్య , సంస్కృతిని సమర్థవంతంగా అనుసంధానించడం ద్వారానే అత్యుత్తమ క్రీడా ప్రతిభను సాధించవచ్చనే నమ్మకంతో రూపొందించారు.
దాదాపు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు ఉంటాయి. వీటిలో ప్రత్యేక బ్యాడ్మింటన్ మౌలిక సదుపాయాలు, 25 మీటర్ల పోటీ స్విమ్మింగ్ పూల్, ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి 25 మీటర్ల షూటింగ్ రేంజ్, సమీకృత క్రీడా విజ్ఞానం , రికవరీ కేంద్రాలు, అలాగే యువ క్రీడాకారులు ఎలాంటి రాజీ లేకుండా విద్య , క్రీడలు రెండింటినీ కొనసాగించేలా వీలు కల్పించే ఒక ఆన్-క్యాంపస్ పాఠశాల ఉన్నాయి.

Leave A Reply

Your Email Id will not be published!