హైదరాబాద్ : గత 12 ఏళ్లుగా ఏపీ ప్రభుత్వం ప్రతి బోర్డు సమావేశాల్లో తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తుందని ఇది కొత్త విషయం కాదని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏపీ ప్రాజెక్ట్ లకు పరోక్షంగా మద్దతు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ నేతలు అధికారం కోల్పోగానే కడుపు మంట తో బట్ట కాల్చి మీద వేస్తున్నారని మంత్రి విరుచుకు పడ్డారు. తెలంగాణ రైతాంగం ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో బీఆర్ఎస్ ఏ రోజు తెలంగాణ ప్రయోజనాలు కాపాడ లేదన్నారు. బీఆర్ ఎస్ అధికారం లో ఉన్న సమయంలో నే రాయల సీమ ఎత్తిపోతల పథకం పనులు జరిగింది వాస్తవం కాదా..? పోలవరం- బనకచర్ల ప్రాజెక్ట్ పనులు ప్రారంభం అయింది బిఆర్ ఎస్ హయాంలో కాదా అని ప్రశ్నిచ్చారు. పట్టి సీమ ఎత్తిపోతల పథకం మీరు అధికారంలో ఉండగా పూర్తి కాలేదా అని మండిపడ్డారు. తొమ్మిదినారేళ్ళు తెలంగాణ సొమ్ము ను లూటీ చేసింది వాస్తవం కాదా అన్నారు.
ఈనెల 18న జరిగే జీఆర్ఎంబీ సమావేశంలో అజెండాలో చేర్చ బడిన అంశాలు కొత్థవేమి కాదన్నారు. ఇవే అంశాలను మునపటి మీటింగులలో మరియు కరెస్పాండన్స్ లలో కూడా ఏపీ ప్రతి సారి ప్రస్తావిస్తూ వస్తున్నదని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవే అంశాలు సీతారామ ఎత్తిపోతల పథకం క్లియరెన్స్ విషయం లో కూడా ప్రస్తావించిందన్నారు. దీని పైన తమ ప్రభుత్వం ధీటుగా స్పందించిందని చెప్పారు. అంతే కాకుండా అవన్నీ అవాస్తవాలని , నిరాధారమైనవని పేర్కొన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ విషయాలను జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ దృష్టికి తీసుకువెళ్లి గత ఏప్రిల్ 24న విజయవంతంగా పర్మిషన్స్ సాధించిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ కాళేశ్వరం, సీతారామ, సమ్మక్క, చిన్న కాళేశ్వరం, చనాకా-కొరటా, మోదికుంట వాగు, గూడెం లిఫ్ట్ తదితర ఏడు ప్రాజెక్టుల అనుమతులు ఇవ్వరాదని కోరుతూ వచ్చిందన్నారు.
