Kasani Jnaneshwar : ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ ఖాయం
ఆ పార్టీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ కామెంట్
Kasani Jnaneshwar : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయం మరింత రంజుగా మారింది. గతంలో రాష్ట్రంలో బలమైన కేడర్ ఉన్న పార్టీగా తెలుగుదేశం పార్టీకి గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఆ పార్టీ జాతీయ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అడ్డంగా బుక్కై రాజమండ్రి జైలుకే పరిమితం అయ్యారు.
Kasani Jnaneshwar Comment for TDP Participation in Telangana
దీంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. పార్టీ పరంగా పోటీ చేస్తుందా లేదా అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ విషయంపై నెలకొన్న అనుమానాలకు తెరదించేందుకు ప్రయత్నం చేశారు టీటీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్(Kasani Jnaneshwar).
ఆయా ప్రధాన పార్టీలు ముదిరాజులను, ప్రత్యేకించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను పట్టించు కోలేదని ఆరోపించారు. బరా బర్ తాము కూడా బరిలో ఉంటామని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో చర్చిస్తామని చెప్పారు కాసాని జ్ఞానేశ్వర్.
త్వరలోనే పార్టీ పరంగా పోటీ చేసే నియోజకవర్గాలు, అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. అయితే తెలంగాణలో ఇంకా పొత్తులపై క్లారిటీ రాలేదని చెప్పారు. ఎన్నికల్లో ఆయా అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేసే సత్తా తమ పార్టీకి ఉందన్నారు టీటీడీపీ చీఫ్.
Also Read : Yerrasekhar : బరిలో ఉంటా బరా బర్ గెలుస్తా