Meruga Nagarjuna : బాబుకు బుద్ది చెప్ప‌డం ఖాయం

మంత్రి మేరుగ నాగార్జున‌

Meruga Nagarjuna : ఆంధ్ర‌ప్ర‌దేశ్ – ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కై రాజ‌మండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఏపీ మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై నిప్పులు చెరిగారు ఏపీ మంత్రి మేరుగ నాగార్జున‌. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న జీవిత కాలంలో ఏనాడైనా నిమ్న వ‌ర్గాల‌ను, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వ‌ర్గాల‌ను ప‌ట్టించుకున్నారా అంటూ ప్ర‌శ్నించారు.

Meruga Nagarjuna Slams Chandrababu

సొల్లు క‌బుర్లు చెప్ప‌డం త‌ప్పితే ఆయ‌న రాష్ట్రానికి చేసింది ఏమీ లేద‌ని మండిప‌డ్డారు మేరుగ నాగార్జున‌. ద‌ళితుల ఆత్మ గౌర‌వాన్ని దెబ్బ తీసేలా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించార‌ని ఆయ‌న‌కు ఈసారి ఎన్నిక‌ల్లో బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు.

వ్య‌వ‌స్థ‌ల‌ను ఇన్నాళ్ల పాటు మ్యానేజ్ చేస్తూ వ‌చ్చార‌ని, కానీ పాపం పండింది క‌నుకే జైల్లో చిప్ప‌కూడు తింటున్నార‌ని ఎద్దేవా చేశారు మేరుగ నాగార్జున‌(Meruga Nagarjuna). యావ‌త్ ద‌ళిత స‌మాజం బాబు అన్న మాట‌ల‌ను మ‌రిచి పోలేద‌న్నారు. అది గుర్తు పెట్టుకుంటే మంచిద‌న్నారు.

చంద్ర‌బాబు నాయుడు, త‌న‌యుడు లోకేష్ నాయుడు , టీడీపీ శ్రేణులు ఎన్ని ర‌కాలుగా జిమ్మిక్కులు చేసినా ఫ‌లితం ఉండ‌ద‌న్నారు. జీవితాంతం జైలులో ఉండ‌క త‌ప్ప‌ద‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి మేరుగ నాగార్జున‌. బాబు మాట‌ల్ని న‌మ్మే స్థితిలో ప్ర‌జ‌లు లేర‌న్నారు.

Also Read : Kasani Jnaneshwar : ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పోటీ ఖాయం

Leave A Reply

Your Email Id will not be published!