చెన్నై : తమిళనాడులో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. అధికారంలో ఉన్న టీవీకే పార్టీ చీఫ్ , సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్, ప్రతిపక్ష డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుకుంది. త్రిష కృష్ణన్‌పై ద్వంద్వార్థం వచ్చేలా వ్యాఖ్యానించినట్లు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు టీవీకే నేతలు, అభిమానులు. బేషరతుగా సీఎంకు క్షమాపణలు చెప్పలని డిమాండ్ చేశారు. తంజావూర్లో కావేరీ జలాల సమస్యపై ప్రసంగిస్తున్న సమయంలో ఈ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మన ముఖ్యమంత్రి కావేరీ జలాల సమస్యపై నోరు మెదపడం లేదు. ఆయనకు డీఎంకే (తన పార్టీ)పై తప్పుడు కేసులు పెట్టడం గురించే ఎక్కువ ఆందోళన ఉందంటూ ఎద్దేవా చేశారు.
ప్రేక్షకుల మధ్యలో ఒకరు త్రిష పేరును ప్రస్తావించినప్పుడు ఆయన నవ్వుతూ ఇలా అన్నారు .నీళ్లు వచ్చినా రాకపోయినా, నీళ్లు రావాలి. నేను కావేరీ గురించే అంటున్నానంటూ ఎద్దేవా చేశారు. వేలాది మంది పురుషుల ముందు నటి త్రిష గురించి అసభ్యకరమైన, అశ్లీలమైన అసంబద్ధమైన ద్వంద్వార్థ పదాలు మాట్లాడిన ఉదయనిధి, రైతుల పోరాటం అనే పేరుతో ఒక నాటకీయ ప్రహసనాన్ని ప్రదర్శిస్తున్నాడని మండిపడ్డారు. ఇది పూర్తిగా అసహ్యం. ఎవరిపైనైనా ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇది అరివాలయం వంశం మనస్తత్వాన్ని, రాజకీయ సంస్కృతిని, దిగజారుతున్న ప్రమాణాలను బయట పెడుతుంది. మీరు ప్రకటించిన నిరసన ప్రారంభం కాకముందే కుప్పకూలింది. ఇప్పుడు, కేవలం దృష్టిని ఆకర్షించాలనే ఆత్రుతతో, మీరు చౌకబారు రెచ్చగొట్టే చర్యలకు, ఎంగేజ్మెంట్ ఫార్మింగ్‌కు పాల్పడ్డారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
