Aishwarya Rai Comment : వెండి తెరపై వాలిన వెన్నెల
ఐష్ అందం చెరగని సంతకం
Aishwarya Rai Comment : సినిమా అన్నది ప్రపంచాన్ని ఆవిష్కరించే అద్భుతమైన కాన్వాస్. కొందరు కళ్ల ముందే తళుక్కున మెరిసి పోతుంటారు. మరికొందరు గుండెల్ని మీటుతూ తచ్చట్లాడేలా చేస్తుంటారు. ఇంకొందరు జ్ఞాపకాల్లో ఎల్లప్పటికీ మెదులుతూనే ఉంటారు. అలాంటి నటీమణుల్లో అతి లోక సుందరిగా, కోట్లాది యువత కలల రాకుమారిగా పేరు పొందిన ఐశ్వర్యా రాయ్ ఒకరు. తనకు 50 ఏళ్లు దాటి పోయాయి. ఎవరైనా నమ్మగలరా ఈ అందాల ముద్దుగుమ్మకు ఇన్నేళ్లు నిండాయని. కళ్లతో శాసించడం తెలుసు.
ఆ కళ్లతో ప్రేమను కురిపించడం తెలుసు. ప్రేమంటే ఇలా ఉంటుందని, ఇలాగే ఉండాలని తను పాత్రలో జీవించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే ఆమెను ఐష్ కాంతగా అభివర్ణిస్తుంటారు. తాను విశ్వ సుందరిగా ఎంపికైనా సరే ఎక్కడా తన వ్యక్తిత్వానికి భంగం కలిగించేలా ఎవరినీ తన దరికి రానీయ లేదు. లెక్కకు మించిన ఆస్తులు ఉన్నా, అంతులేని స్టార్ డమ్ తన వెంట ఉన్నా తనలో నటన ఇంకా మిగిలే ఉందని , అది ఇంకా ఇంకా తనను దహించి వేస్తుందని చాటి చెప్పింది.
Aishwarya Rai Comment Viral
సినీ వెండి తెరపై కొందరు ఎల్లప్పటికీ వెలుగుతూనే ఉంటారు. తమ హావ భావాలతో కళ్లను కాటేస్తారు. అలాంటి వారిలో రేఖ, మాధురీ దీక్షిత్ తో పాటు ఐశ్వర్య రాయ్(Aishwarya Rai) కూడా. అందుకే తనలోని పసితనాన్ని ముందుగా గుర్తించిన ఘనత మణిరత్నంకు దక్కుతుంది. ఇన్నేళ్లయినా ఎక్కడా అందం చెరిగి పోలేదు. ఇంకా రోజులు పెరిగే కొద్దీ, ఏళ్లు గడిచే కొద్దీ ప్రేమతనం పెరుగుతోందే తప్పా తగ్గదని చాటి చెప్పింది ఐశ్వర్యా రాయ్. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే తనను దృష్టిలో పెట్టుకుని తాళ్ తీశానన్నాడు. ఈ మధ్యనే ఆ టీం కలుసుకుంది. కళ్లతో చూసేటి గురువా అన్న పాట, తాళ్ సే తాళ్ మిళా అన్న సాంగ్ ఎవర్ గ్రీన్ గా ఉండి పోతాయి. కేవలం గేయ రచయితలు, దర్శకులు కేవలం ఐశ్యర్య రాయ్ ను చూసే వీటిని రాయించి ఉంటారేమోనన్న అనుమానం రాక మానదు.
అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీలో ఒకరిగా ఉండి పోయిన ఐశ్వర్యా రాయ్ ఉన్నట్టుండి మళ్లీ మణిరత్నం సినిమాలో మెరిసింది. అదే పొన్నియన్ సెల్వన్. ఓహ్..అందం అంటే ఇలా కూడా ఉంటుందా అన్న రీతిలో తీర్చి దిద్దాడు తనని. ఎక్కడా అసభ్యత అన్నది లేకుండా, పూర్తిగా లీనమై పోయేలా తనను పాత్రకు ఎంపిక చేశాడు. అది కూడా సెన్సేషన్ మూవీగా మిగిలి పోయింది. ఏ సినిమా రంగమైనా సరే ఐశ్వర్య రాయ్(Aishwarya Rai) నటిస్తుందంటే చాలు కళ్లు మూసు కోవాల్సిందే. అలా తనను తాను మల్చుకుంది. సల్మాన్ ప్రేమలో పడి ఓడి పోయినా హమ్ దిల్ దే చుకే సనమ్ ఒక్కటి చాలు సంజయ్ లీలా భన్సాలీ ఎందుకు తనను ఏరి కోరి తీసుకున్నాడో. భగ్న హృదయాలు తల్లడిల్లి పోయాయి. ఓ దర్శకుడైతే ఏకంగా ఐశ్వర్య కళ్లను చూసి సినిమాలు తీసేయొచ్చన్నాడు. ఐశ్వర్య కలకాలం ఇలాగే ఉండాలి. మనకోసమైనా తను నటించాలి.
Also Read : Yandamuri Veerendranath : నవలా రచయిత