IPL Auction 2024 : ఐపీఎల్ వేలం పాట ఖ‌రారు

డిసెంబ‌ర్ 19న దుబాయిలో

IPL Auction 2024 : ముంబై – భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ప్ర‌తి ఏటా ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించే అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) కు సంబంధించి అప్ డేట్ ఇచ్చింది. ఇందులో భాగంగా వ‌చ్చే ఏడాది భార‌త్ లో నిర్వ‌హించే ఐపీఎల్ కు గాను ఈసారి వేలం పాట నిర్వ‌హించే ప్ర‌దేశాన్ని మార్చిన‌ట్లు పేర్కొంది.

IPL Auction 2024 Will be Start

దుబాయ్ వేదిక‌గా ఈసారి ఐపీఎల్(IPL) వేలం పాట‌ను చేప‌డ‌తామ‌ని వెల్ల‌డించింది. వేలం పాట నిర్వ‌హించే తేదీని కూడా ఖ‌రారు చేసిన‌ట్లు బీసీసీఐ అధికారికంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపింది. వ‌చ్చే నెల డిసెంబ‌ర్ 19న ముహూర్తం నిర్ణ‌యించిన‌ట్లు పేర్కొంది.

ఇదిలా ఉండ‌గా ఐపీఎల్ ఈ ఏడాది 10 జట్లు పాల్గొన్నాయి. ఆయా జ‌ట్ల యాజ‌మాన్యాలు ఎవ‌రిని ఉంచుకుంటున్నాయి, ఎవ‌రిని తీసి వేస్తున్నాయ‌నే దానిపై పూర్తి స‌మ‌చారం బీసీసీఐ ఆధ్వ‌ర్యంలోని ఐపీఎల్ క‌మిటీకి స‌మ‌ర్పించాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది బీసీసీఐ.

ఆయా ఫ్రాంచైజీలు రిటైన్ , రిలీజ్ చేసిన క్రికెట‌ర్ల జాబితాను న‌వంబ‌ర్ 26 లోపు స‌మ‌ర్పించాల‌ని తెలిపింది. ఇక జ‌ట్ల ప‌రంగా చూస్తే పంజాబ్ కింగ్స్ టాప్ లో ఉంది. ఆ ఫ్రాంచైజీ వ‌ద్ద రూ. 12.90 కోట్లు ఉండ‌గా ఎస్ ఆర్ హెచ్ వ‌ద్ద రూ.6.55 కోట్లు, ఢిల్లీ క్యాపిట‌ల్స్ వ‌ద్ద రూ. 4.45 కోట్లు , ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ వ‌ద్ద రూ. 3.55 కోట్లు ఉన్నాయ‌ని తెలిపింది ఐపీఎల్ కమిటీ. ఇక విచిత్రం ఏమిటంటే ముంబై ఇండియ‌న్స్ వ‌ద్ద కేవ‌లం రూ. 5 ల‌క్ష‌లు మాత్ర‌మే ఉండ‌డం విశేషం.

Also Read :G Parameshwara : క‌న్న‌డ నాట సీఎం కుర్చీలాట‌

Leave A Reply

Your Email Id will not be published!