CJI Governors Comment : గవర్నర్లా రాజ్యాంగేతర శక్తులా
సీజేఐ ధనంజయ సీరియస్
CJI Governors Comment : దేశానికి స్వేచ్ఛ లభించినప్పటి నుంచి నేటి దాకా గవర్నర్ల వ్యవస్థపై చర్చోప చర్చలు కొనసాగుతున్నాయి. ప్రజల నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధులను కంట్రోల్ చేసేందుకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారని అంతా భావిస్తున్నారు. కానీ రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చాలా ముందు చూపుతో ఆలోచించి వీరి ఏర్పాటును ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాజ్యాంగానికి పరిరక్షకులుగా ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే వాచ్ డాగ్స్ గా పరిగణిస్తారు. ఏదైనా చట్టం కావాలన్నా లేదా శాసనంగా మారాలన్నా ముందు అసెంబ్లీలో, శాసన మండలిలో తీర్మానం కావాలి. మూడొంతుల మెజారిటీ సాధించాలి. ఆ తర్వాత గవర్నర్(Governer) వద్దకు బిల్లును పంపాలి. దీనిపై మొత్తం కూలంకుశంగా పరిశీలించిన తర్వాత ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. ఇది అనాది నుంచి కొనసాగుతూ వస్తున్న తంతు.
CJI Governors Comment Viral
కానీ రాను రాను కేంద్రంలో ఒక పార్టీ పవర్ లోకి రావడం, రాష్ట్రాలలో మరో పార్టీలు కొలువు తీరడంతో కేంద్రం, రాష్ట్రాల మధ్య ఆధిపత్య పోరుకు తెర లేసింది. ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం, అనుచిత కామెంట్స్ చేయడం, రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించడం, ఆమోదించిన బిల్లులపై సంతకాలు చేయకుండా తొక్కి పెట్టడం, కావాలని కొర్రీలు వేయడం, ఆలస్యం చేయడం, ఇలా చెప్పుకుంటూ గిల్లి కజ్జాల దాకా వెళ్లింది. ఆ మధ్యన తమిళనాడు అసెంబ్లీలో రాష్ట్ర గవర్నర్(Governer) బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని చదవకుండా బయటకు వెళ్లి పోయారు. ఒక రకంగా రాజ్యాంగాన్ని అవమాన పరిచారు. తనను తాను తక్కువ చేసుకున్నారు. ఆర్ఎన్ రవి అనుసరించిన పద్దతి దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసేలా చేసింది. అక్కడ డీఎంకే కొలువు తీరింది. సీఎం స్టాలిన్ తో పడడం లేదు. బాహాటంగా విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్లింది సీఎం, గవర్నర్ల మధ్య. దీనిపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు స్టాలిన్.
దీనికి తానేమీ తీసిపోనట్లుగా మారింది తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ గవర్నర్ తమిళి సై , సీఎం కేసీఆర్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత దాకా వెళ్లింది. గవర్నర్(Governer) కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఫైల్ ను తిప్పి పంపింది. ఇలా చాలా ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయని ఆరోపిస్తూ ఏకంగా సీఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరో వైపు పంజాబ్ లో సైతం గవర్నర్ వర్సెస్ సీఎం భగవంత్ మాన్ గా మారి పోయింది. ఒకరిపై మరొకరు దూషణలకు దిగే స్థాయికి వెళ్లింది. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన వాళ్లు రాజకీయాలు చేస్తే ఎలా అనే విమర్శలు లేక పోలేదు. తాజాగా సుప్రీంకోర్టులో గవర్నర్ల తీరుపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది. జస్టిస్ ధనంజయ చంద్రచూడ్(DY.Chandrachud) ఆధ్వర్యంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక రకంగా గవర్నర్లు గీత దాటారని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదంటూ చురకలు అంటించారు. అంతే కాదు సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కేంద్రానికి, ఇటు గవర్నర్లకు షాక్ ఇచ్చాయని చెప్పక తప్పదు. ఇకనైనా మారాలి. రాష్ట్రాల అభివృద్దిలో కీలక పాత్ర పోషించాలి.
Also Read : Revanth Reddy : కామారెడ్డిలో రేవంత్ నామినేషన్