YS Sharmila : కేసీఆర్ అఫిడవిట్ షర్మిల సెటైర్
సెంటు భూమి..సొంత కారు కూడా లేదా
YS Sharmila : హైదరాబాద్ – వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఆమె మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. సీఎం అఫిడవిట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. తను సమర్పించిన అఫిడవిట్ లో సెంటు భూమి లేదని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. విచిత్రం ఏమిటంటే సొంత కారు కూడా లేదని చెప్పడం ప్రజల చెవుల్లో పూలు పెట్టడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు వైఎస్ షర్మిల(YS Sharmila).
YS Sharmila Comments on KCR
కాస్తంత జాగా , కారు లేకుండా ఉన్న ఏకైక సీఎం దేశంలో ఒక్క కేసీఆర్ మాత్రమే ఉంటాడని పేర్కొన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం దారుణమన్నారు. లక్షా 20 వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తీసుకున్న కమీషన్లను ఎక్కడ దాచుకున్నారో కేసీఆర్ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
సర్కార్ భూములు అమ్మిన సొమ్మును ఎవరి జేబులో నింపారో చెప్పాలన్నారు. అబద్దాలు ఆడితే అతికినట్టు ఉండాలని , పదేళ్లుగా అడ్డదిడ్డంగా దోచుకున్నాడని , దానిని ఎక్కడ దాచుకున్నాడో చెప్పాలని అన్నారు వైఎస్ షర్మిల.
ఓట్ల కోసం వేల అబద్దాలు ఆడే కేసీఆర్ ఈ అఫిడవిట్ లో మాత్రం నిజాలు ఎందుకు చెబుతారని ప్రశ్నించారు.
Also Read : Chadalavada Nagarani : 1510 మందికి ఇంజనీరింగ్ సీట్లు