Revanth Reddy Slams : బీఆర్ఎస్ పతనం కాంగ్రెస్ విజయం
టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి
Revanth Reddy Slams : రామగుండం – తెలంగాణ పేరుతో రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్న కల్వకుంట్ల కుటుంబానికి చెక్ పెట్టాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండంలో పర్యటించారు. ఈ సందర్బంగా జరిగిన భారీ బహిరంగ సభలో ప్రంసగించారు. బాల్క సుమన్ బలుపు దిగాలంటే వివేక్ వెంకట స్వామిని గెలిపించాలని అన్నారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి మోసం చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు.
Revanth Reddy Slams KCR
చీకట్లో మగ్గుతున్న రామగుండంలో వెలుగులు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). రైతులకు రూ. 2 లక్షల రుణ మాఫీ జరగాలన్నా, 2 లక్షల కొలువుల భర్తీ కొనసాగాలన్నా, నిరుద్యోగులకు భృతి కలగాలంటే తప్పకుండా హస్తంను ఆదరించాలని పిలుపునిచ్చారు.
ఇవాళ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణను నిట్ట నిలువునా కేసీఆర్ ముంచాడని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం జైలుకు పోవడం ఖాయమని జోష్యం చెప్ఆరు రేవంత్ రెడ్డి. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తమకు కనీసం 70 సీట్లకు పైగానే వస్తాయని జోష్యం చెప్పారు.
Also Read : Varudu Kalyani : పురందేశ్వరిపై కళ్యాణి ఫైర్