Yashasvini Reddy : పాలకుర్తి గడ్డ కాంగ్రెస్ అడ్డా
ఝాన్సీ యశస్విని రెడ్డి ధీమా
Yashasvini Reddy : పాలకుర్తి – నిన్నటి దాకా పాలకుర్తిలో అన్నీ తానై వ్యవహరించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఇక చుక్కలు చూపిస్తానని అన్నారు కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన ఎన్నారై ఝాన్సీ యశస్విని రెడ్డి. ఈసారి ఎన్నికల్లో దొరల పాలనకు , ప్రజా పాలనకు మధ్య జరుగుతున్న పోటీ అని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు గ్రామాల్లో.
Yashasvini Reddy Comments Viral
ప్రజలను ఉద్దేశించి యశస్విని రెడ్డి ప్రసంగించారు. ఇక నుంచి గులాబీ జెండాకు స్థానం లేదన్నారు. ఇక్కడ ఎగర బోయేది కాంగ్రెస్(Congress) జెండానేనని పేర్కొన్నారు. ప్రజలు కోరుకున్న విధంగా పాలన సాగుతుందన్నారు. తనను గెలిపిస్తే 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.
గత కొన్నేళ్లుగా తమ కుటుంబం ప్రజా సేవలోనే మునిగి పోయిందన్నారు. ఇక నుంచి ఎర్రబెల్లి ఆటలు సాగవన్నారు యశస్విని రెడ్డి. ఆయన ఎన్ని జిమ్మిక్కులు చేసినా, లేదా ఎన్ని ప్రలోభాలు చూపించినా జనం నమ్మే స్థితిలో లేరన్నారు. ఎర్రబెల్లి ఇంటికి పోవడం తప్ప చేసేది ఏమీ లేదన్నారు. ఇన్నాళ్ల పాటు ఆధిపత్య ధోరణితో వ్యవహరించాడని ఇక ఆటలు సాగవన్నారు .
Also Read : Revanth Reddy Slams : బీఆర్ఎస్ పతనం కాంగ్రెస్ విజయం