IND vs NED ICC ODI World Cup : వరల్డ్ కప్ లో భారత్ రికార్డ్ స్కోర్
నెదర్లాండ్స్ పై అత్యధిక రన్స్
IND vs NED ICC ODI World Cup : బీసీసీఐ ఆధ్వర్యంలో ఐసీసీ(ICC) వన్డే వరల్డ్ కప్ 2023లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు పరుగుల మోత మోగించింది. ప్రపంచ కప్ లో అత్యధిక రన్స్ చేసిన జట్టుగా నిలిచింది. ఏకంగా నిర్ణీత 50 ఓవర్లలో 410 రన్స్ చేసింది. ఇందులో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో మెరిశాడు. అనంతరం మైదానంలోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ దుమ్ము రేపాడు.
IND vs NED ICC ODI World Cup Updates
నెదర్లాండ్స్ జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. పరుగుల వరద పారించాడు. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చి పోయాడు. ప్రతి బంతి స్టాండ్స్ లోకి చేరింది. ఇదే సమయంలో కేఎల్ రాహుల్ ఆశించిన దానికంటే ఎక్కువ ప్రతిభ చూపాడు.
తనదైన శైలిలో రాణించాడు. కేవలం 62 బంతులు మాత్రమే ఎదుర్కొన్న కేఎల్ రాహుల్ సెంచరీతో కదం తొక్కాడు. ఫోర్లు, సిక్సర్ల మోత మోగించాడు. టోర్నీలోనే ఇదే భారీ స్కోర్ కావడం విశేషం. శ్రేయస్ అయ్యర్ 125 పరుగులతో అజేయంగా నిలిచారు. కేఎల్ రాహుల్ 102 రన్స్ చేశాడు. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో ముగించాడు. సెంచరీ సాధిస్తాడని అనుకున్న సమయంలో ఉన్నట్టుండి ఆ ఛాన్స్ మిస్ అయ్యాడు.
ప్రత్యర్థి బౌలర్లకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. భారత బ్యాటర్లు ఊచకోత కోశారు. కళ్లు చెదిరే షాట్స్ తో ఆకట్టుకున్నారు. ఒక రకంగా చుక్కలు చూపించారు.
Also Read : Congress Slams : గువ్వల బాలరాజు ఓ గూండా