Virat Kohli : రన్ మెషీన్ సెన్సేషన్
విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్
Virat Kohli: ముంబై – ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఉత్కంఠ భరిత సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఎట్టకేలకు భారత జట్టు ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకుంది. అటు బ్యాటింగ్ లోటు ఇటు బౌలింగ్ లోనూ దుమ్ము రేపింది. ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించింది.
Virat Kohli Trending
వరల్డ్ క్రికెట్ లో టాప్ మోస్ట్ క్రికెటర్ గా పేరు పొందిన రన్ మెషీన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో రికార్డుల మోత మోగించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేష్ టెండూల్కర్ ను అధిగమించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 397 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కోహ్లీ 113 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు 2 సిక్స్ లతో 117 పరుగులతో రెచ్చి పోయాడు. కళ్లు చెదిరే షాట్స్ తో అలరించాడు.
తనకు ఇష్టమైన మైదానంలో పూర్తిగా నియంత్రణతో కూడిన ఆటను ప్రదర్శించాడు. తను ప్రేమించే సచిన్ చేసిన 49 సెంచరీల రికార్డును బ్రేక్ చేశాడు. తన కెరీర్ లో 50వ సెంచరీని నమోదు చేశాడు. క్రికెట్ లో తాను కింగ్ నంటూ నిరూపించాడు. వరల్డ్ కప్ లో అత్యధిక రన్స్ చేసిన క్రికెటర్ గా నిలిచాడు.
Also Read : IND vs NZ ICC ODI World Cup : కీవీస్ ఇంటికి భారత్ ఫైనల్ కు