Daryl Mitchell : మిచెల్ పోరాటం అద్భుతం
కేన్ విలియమ్సన్ కీలక ఇన్నింగ్స్
Daryl Mitchell : ముంబై – వన్డే వరల్డ్ కప్ లో భాగంగా వాంఖడే మైదానంలో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ గెలుపొందినా ప్రత్యర్థి న్యూజిలాండ్ చివరి దాకా పోరాడింది. ఈ జట్టులో మిచెల్ ఒంటరి పోరాటం చేశాడు. చివరి దాకా గెలిపించేందుకు శత విధాలుగా ప్రయత్నం చేశాడు.
Daryl Mitchell Batting Viral
అయినా ఫలితం లేకుండా పోయింది. ఒకానొక దశలో ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయిన కీవీస్ ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన మిచెల్(Daryl Mitchell ) , కెప్టెన్ కేన్ విలియమ్సన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 4 వికెట్లు కోల్పోయిన 397 రన్స్ చేసింది. భారీ టార్గెట్ ముందుంచింది. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా ఎక్కడా తడబడలేదు. భారత బౌలర్లను చీల్చి చెండాడు మిచెల్. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చి పోయాడు. 134 పరుగులు చేశాడు. దీంతో కీవీస్ 327 రన్స్ కు ఆల్ ఔట్ అయ్యింది.
ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు కేన్ విలియమ్సన్. కళ్లు చెదిరే షాట్స్ తో అలరించాడు. భారత్ జట్టులో ఇద్దరు సెంచరీలు చేశాడు. విరాట్ కోహ్లీ 117 రన్స్ చేస్తే అయ్యర్ 105 రన్స్ తో దుమ్ము రేపాడు.
Also Read : Rajinikanth : వాంఖడే స్టేడియంలో తలైవా