Nagarjuna Networth : నాగార్జున నికర ఆస్తులు రూ. 3,010 కోట్లు
దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో టాప్
Nagarjuna Networth : ప్రముఖ జీక్యూ సంస్థ సంచలన ప్రకటన చేసింది. దక్షిణ భారత దేశ చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక నికర ఆదాయం కలిగిన నటీనటులలో నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున . ఆయన ఇప్పటి వరకు 100కు పైగా సినిమాలలో నటించారు. రియాల్టీ షోకు ప్రయోక్తగా ఉన్నారు. బిగ్ బాస్ 7 కు ప్రస్తుతం హోస్ట్ చేస్తున్నారు.
Nagarjuna Networth Viral
ఇదిలా ఉండగా ఒకటి కాదు రెండు కాదు నాగార్జున నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 3,010 కోట్లని జీక్యూ సంస్థ పేర్కొంది. ఈ ప్రాంతంలోనే అత్యంత సంపన్నమైన నటుడిగా గుర్తింపు పొందారు. తన నటనతో ఆకట్టుకుంటున్నాడు. ఇక నాగార్జున(Nagarjuna) తండ్రి అక్కినేని నాగేశ్వర్ రావు పేరు పొందిన నటుడు. ఇక నాగ్ వయస్సు 64 ఏళ్లు.
ఇప్పటికీ ఆయన సినిమాలలో నటిస్తున్నారు. తాజాగా నా సామి రంగా లో నటించారు. ఇది కూడా త్వరలో విడుదల కానుంది. ఒక్కో మూవీకి రూ. 9 నుంచి 20 కోట్ల దాకా తీసుకుంటున్నట్లు టాక్. అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ఉంది. కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీ కో ఓనర్ గా ఉన్నాడు. గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్ ను కలిగి ఉన్నాడు. భారీ ఆదాయంతో రికార్డ్ బ్రేక్ చేశాడు.
Also Read : Minister KTR : యాదాద్రికి ధీటుగా భద్రాద్రి అభివృద్ది