Sanju Samson : శాంసన్ పై కక్ష కట్టిన బీసీసీఐ
మరోసారి మోసం చేసిన సంస్థ
Sanju Samson : వరల్డ్ కప్ లో పేలవమైన ఆట తీరుతో ఓటమి పాలైన భారత జట్టులో పలువురిని పక్కన పెట్టింది. తాజాగా ఛాంపియన్ గా నిలిచిన ఆస్ట్రేలియాతో నవంబర్ 23 నుంచి టి20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ముంబై లాబీయింగ్ మరోసారి ప్రభావం చూపడం విశేషం. ఇక అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ మరోసారి కక్ష కట్టింది కేరళ స్టార్ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్(Sanju Samson) పై.
Sanju Samson Again Refused
విచిత్రం ఏమిటంటే వన్డే వరల్డ్ కప్ లో ఆశించిన మేర రాణించని సూర్య కుమార్ యాదవ్ కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది ఎంపిక కమిటీ. ఇటీవల జరిగిన ఐపీఎల్ లో సత్తా చాటిన యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చిన అగార్కర్ దృష్టికి సంజూ శాంసన్ రాక పోవడం ఒకింత విస్తు పోయేలా చేసింది.
మొత్తంగా బీసీసీఐ ప్రస్తుతం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా తనయుడు జే షా కార్యదర్శి చేతిలో బందీ అయి పోయింది. భారత్ తో ఆసిస్ 5 మ్యాచ్ ల టీ20 సీరీస్ ఆడనుంది. ట్రాక్ రికార్డ్ చూస్తే ఆస్ట్రేలియాతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన చరిత్ర కేరళ స్టార్ ది.
ఇకనైనా వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పుల్ స్టాప్ పెట్టి భవిష్యత్తు నాశనం కాకుండా ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
Also Read : Surya kumar Yadav : టి20 జట్టు కెప్టెన్ గా సూర్యా భాయ్