JD Lakshminarayana : బర్రెలక్కకు భద్రత కల్పించండి
మాజీ సీబీఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ
JD Lakshminarayana : ఆంధ్రప్రదేశ్ – మాజీ సీబీఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ(JD Lakshminarayana) షాకింగ్ కామెంట్స్ చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచిన బర్రెలక్కకు మద్దతుగా నిలిచారు. బుధవారం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. తను ప్రచారం చేస్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తనతో పాటు సోదరుడిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంలో ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
JD Lakshminarayana Comments Viral
దాడి అనంతరం పెద్ద ఎత్తున బర్రెలక్కకు మద్దతు లభిస్తోంది సోషల్ మీడియా వేదికగా. కొల్లాపూర్ లో ప్రధాన పార్టీలకు ధీటుగా తను నిలబడడం చర్చకు దారితీసేలా చేసింది. బర్రెలక్క శిరీష ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా పాపులర్ అయ్యారు.
ఇతర దేశాలలో ఉన్న ప్రవాస తెలుగు వారందరూ ఆమెకు మద్దతుగా నిలిచారు. మరికొందరు తమకు తోచిన రీతిలో సాయం చేస్తున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రొఫెసర్స్, కుల , ప్రజాస్వామిక సంఘాలు, కవులు, కళాకారులు, రచయితలు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా బర్రెలక్కపై దాడి చేయడం హేయ్యమైన చర్యగా అభివర్ణించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీకి, ఎన్నికల కమిషనర్ కు ట్యాగ్ చేయడం విశేషం.
Also Read : Vichitra Slams : బాలకృష్ణ మామూలోడు కాదు