Komatireddy Venkat Reddy : కేసీఆర్ కుటుంబం ఇక జైలుకే
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Komatireddy Venkat Reddy : తెలంగాణ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన కల్వకుంట్ల కుటుంబాన్ని తాము అధికారంలోకి వచ్చాక జైలుకు పంపించడం ఖాయమన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy). ఎన్నికల ప్రచారంలో భాగంగా సీరియస్ కామెంట్స్ చేశారు. ఆరు నూరైనా సరే బీఆర్ఎస్ ఓడి పోవడం ఖాయమని జోష్యం చెప్పారు. తిన్నదంతా కక్కిస్తామని , ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
Komatireddy Venkat Reddy Comments on KCR Family
కేవలం మాయ మాటలు చెప్పి ఇంత కాలం ప్రజలను మోసం చేస్తూ వచ్చాడని, ఇక చెప్పేందుకు ఏమీ లేదన్నారు. ఉన్నదంతా ఊడ్చేశాడని, తెలంగాణను అప్పుల కుప్పగా మార్చేశాడని ధ్వజమెత్తారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఛీ కొట్టే రోజు తప్పకుండా వస్తుందన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
ఈ కొన్ని రోజులు అప్రమత్తంగా ఉండాలని లేక పోతే రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా జాబ్స్ ఖాళీగా ఉంటే ఒక్క పోస్టు భర్తీ చేయలేదన్నారు. తన ఇంట్లో కూతురు ఓడి పోతే వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడని మరి కొలువులను నియమించడంలో ఎందుకు తాత్సారం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
Also Read : Revanth Reddy : కేసీఆర్ తిన్నదంతా కక్కిస్తాం