Revanth Reddy : కేసీఆర్ తిన్నదంతా కక్కిస్తాం
టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి
Revanth Reddy : హైదరాబాద్ – బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో కోరి కొనితెచ్చుకున్న తెలంగాణను అడ్డం పెట్టుకుని అందినంత మేర దోచుకున్నాడని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత , సంతోష్ రావు లు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
Revanth Reddy Slams KCR
119 నియోజకవర్గాలకు గాను తమ పార్టీకి కనీసం 80కి పైగానే సీట్లు వస్తాయని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy ). కేసీఆర్ గడీలోకి పేదలకు ప్రవేశం ఉండదన్నారు. అమరుల కుటుంబాలను కూడా గౌరవించిన పాపాన పోలేదన్నారు. చివరకు ప్రజా యుద్ధ నౌక గద్దరన్నను కూడా గేటు లోపలికి రానీయ లేదని ఆరోపించారు టీపీసీసీ చీఫ్.
పేదోడి చెమట వాసన ఎట్లుంటుందో తెలియని కేసీఆర్ ను తెలంగాణ నుంచి తన్ని తరమాల్సిన అవసరం ఉందన్నారు . ఇకనైనా ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని లేక పోతే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు రేవంత్ రెడ్డి.
మీరు ఎవరైనా కేసీఆర్ బక్కటోడు అనుకుంటే పొరపాటు పడినట్లేనని లక్ష కోట్లు తిన్న రాబందు అని ధ్వజమెత్తారు.
Also Read : RS Praveen Kumar : రైతు బంధు మోసం ఓటర్లకు గాలం
