Rahul Dravid : అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్
స్పష్టం చేసిన రాహుల్ ద్రవిడ్
Rahul Dravid : బెంగళూరు – భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా తిరిగి నియమించడంపై స్పందించారు రాహుల్ ద్రవిడ్. మరోసారి తనకు అవకాశం ఇచ్చినందుకు బీసీసీఐ చీఫ్ రోజర్ బిన్నీ, కార్యదర్శి జే షాకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా తన కాంట్రాక్టు పూర్తయింది. రెండేళ్ల పాటు హెడ్ కోచ్ గా జట్టుకు సేవలు అందించారు. తిరిగి కాంట్రాక్ట్ ఉంటుందో లేదోనన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.
Rahul Dravid Comment
ఇండియన్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ ను హెడ్ కోచ్ గా నియమిస్తారని అనుకున్నారు. ఫ్యాన్స్ కూడా అలాగే ఊహించారు. కానీ ఊహించని రీతిలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) కాంట్రాక్ట్ ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది.
తన కాంట్రాక్టు పొడగించడంపై స్పందించారు రాహుల్ ద్రవిడ్. రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే అత్యున్నతమైన జట్టుగా టీమిండియాను తీర్చి దిద్దుతానని స్పష్టం చేశారు . అయితే భారత జట్టు దేశంలో జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ దాకా వచ్చి ఓటమి పొందడం తనను బాధకు గురి చేసిందన్నారు. ఏది ఏమైనా ఆసిస్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుందన్నారు.
Also Read : Tummala Nageswara Rao : కాంగ్రెస్ కు ఢోకా లేదు