IPL 2024 Auction : ఐపీఎల్ లిస్టులో 1,166 క్రికెటర్లు
19న దుబాయ్ లో ఐపీఎల్ వేలం
IPL 2024 Auction : ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రిమీయర్ లీగ్(IPL) కు సంబంధించి శుభ వార్త చెప్పింది బీసీసీఐ. ఈ మేరకు ఐపీఎల్ మినీ వేలం పాట దుబాయ్ లో జరగనుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ గవర్నింగ్ బాడీ ధ్రువీకరించింది.
IPL 2024 Auction Updates
ఇదిలా ఉండగా ఈసారి ఐపీఎల్ కు సంబంధించి మొత్తం 1,166 మంది క్రికెటర్లు వేలం పాటలో పాల్గొననున్నారు. ఇప్పటి వరకు ఐపీఎల్ లో మొత్తం 10 ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఇందులో రాజస్థాన్ రాయల్స్ , ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ , సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ , గుజరాత్ టైటాన్స్ , లక్నో జెయింట్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ ఇండియన్స్ జట్లు ఉన్నాయి.
ఐపీఎల్ 17వ సీజన్ కు సంబంధించి త్వరలోనే వేలం పాట జరగనుందని పేర్కొంది బీసీసీఐ. గతంలో మినీ ఐపీఎల్ వేలాన్ని బెంగళూరు వేదికగా చేపట్టారు. డిసెంబర్ 19న దుబాయిలో ఈ వేలం పాట జరగనుందని ప్రకటించింది ఐపీఎల్ మేనేజ్ మెంట్.
వేలం పాటకు సంబంధించి పూర్తి వివరాలను ప్రకటించింది బీసీసీఐ. మొత్తం 1,166 మంది ఐపీఎల్ కోసం రిజిష్టర్ చేసుకున్నారని తెలిపింది. ఇందులో 212 మంది క్యాప్డ్ ప్లేయర్లు ఉండగా 900 మంది అన్ క్యాప్డ్ ఆటగాళ్లు ఉన్నారని స్పష్టం చేసింది. ఈసారి వరల్డ్ కప్ లో దుమ్ము రేపిన రచిన్ రవీంద్ర, ట్రావిస్ హెడ్ , మిచెల్ , ప్యాట్ కమిన్స్ కూడా నమోదు చేసు కోవడం విశేషం.
Also Read : IND vs AUS 4th T20 : ఉత్కంఠ పోరులో భారత్ విక్టరీ