PM Modi : మోదీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్
వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్
PM Modi : న్యూఢిల్లీ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ , యుకె చీఫ్ సునక్ , యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ డెర్ లేయెన్ తో పాటు ఐక్య రాజ్య సమితి కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ పాల్గొన్నారు. దుబాయ్ వేదికగా వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్ లో మోదీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.
PM Modi Sensation
ప్రపంచ బ్యాంక్ చీఫ్ అజయ్ బంగా , ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ కూడా పాల్గొన్నారు. విచిత్రం ఏమిటంటే ఇటలీ ప్రధాన మంత్రి మెలోనీ ప్రధానమంత్రితో ములాఖత్ అయ్యారు. ప్రధాన అంశాలపై చర్చించారు. ప్రత్యేకించి పీఎంతో సెల్ఫీ తీసుకున్నారు. ఇద్దరికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మరాయి.
ఈ శిఖరాగ్ర సదస్సులో ప్రపంచంలో చోటు చేసుకున్న వాతావరణ మార్పులపై కీలక చర్చ జరిగింది. మోదీ సమర్థవంతమైన నాయకుడని ప్రశంసలు కురిపించారు ఇటలీ ప్రధానమంత్రి మెలోనీ. ఇందుకు సంబంధించిన పోస్ట్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ప్రస్తుతం వైరల్ గా మారింది.
భారత్, ఇటలీ దేశాల మధ్య మంచి సత్ సంబంధాలు గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు మెలోనీ . యూఏఈ చీఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ , స్వీడీష్ పీఎం క్రిస్టర్సన్ , టర్కీ చీఫ్ ఎర్డోగాన్ , బార్బడోస్ కంటౌర్ మియా అమోర్ మోట్లీ హాజరయ్యారు. ప్రధాన మంత్రితో ములాఖత్ అయ్యారు.
Also Read : Animal Movie : వంగా యానిమల్ సెన్సేషన్